Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

కంటోన్మెంట్‌ పరిధిలోని బస్తీలు, కాలనీలకు ఉచితంగా తాగునీటి సరఫరా

: మంత్రి తలసాని
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బస్తీలు, కాలనీలకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటి సరఫరా చేస్తామని అన్నారు.దేశంలో 62 కంటోన్మెంట్‌ బోర్డులు ఉండగా ఒక్క తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఈ విధానాన్నిఅమలు చేస్తున్నట్టు తెలిపారు.బుధవారం కంటోన్మెంట్‌ పరిధిలోని వివిధ సమస్యలపై మంత్రి ఉన్నతాథికారులు, స్థానిక ఎమ్మెల్యే సాయన్న తదితరులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్‌ ఎంసి పరిధిలో సరఫరా చేస్తున్నట్టుగానే కంటోన్మెంట్‌ వాసులకు ఉచితంగా తాగునీటి సరఫరా చేస్తామని తెలిపారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కంటోన్మెంట్‌ బోర్డులో అభివృద్ధి చేపట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img