Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పులుల సంరక్షణతోనే అడవుల రక్షణ సాధ్యం

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
పులుల సంరక్షణతోనే అడవుల రక్షణ సాధ్యం అవుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ (ఎన్టీసీఏ )తో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌- వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని టైగర్‌ రిజర్వ్‌ లను కలుపుతూ పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ (ఎన్‌టీసీఏ) ఇండియా ఫర్‌ టైగర్స్‌-ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ ను అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పులుల ఆవాసాలరక్షణ, విస్తరణకు ప్రజలమద్దతు అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో త్రికోణ అగ్రభాగాన నిలిచిన పులులను సంరక్షించాల్సిన అవసరంఎంతైనా ఉందని చెప్పారు. పులుల సంరక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందన్నారు. తెలంగాణలోని రెండు టైగర్రిజర్వ్లలో పులుల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img