Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

బాలికల డిజిటల్‌ విద్యకు అత్యంత ప్రాధాన్యం

: మంత్రి సత్యవతి
బాలికలకు డిజిటల్‌ విద్య అందించి, వారి గొప్పతనాన్ని వెలికితీసి ప్రపంచానికి చాటడంలో పూర్తి తోడ్పాటు అందించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ‘డిజిటల్‌ జనరేషన్‌-అవర్‌ జనరేషన్‌’ అనే నినాదంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని.. కరోనా నేపథ్యంలో బాలికల చదువులు ఆగిపోవద్దనేదే దీని ఉద్దేశమని తెలిపారు. మహిళలకు, బాలికల కోసం సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో టాపర్‌గా నిలిచిన బాలికలకు రూ.2500, రూ.5 వేలు, రూ.10 వేలు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img