Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మత్స్యకారులకు ప్రభుత్వం అండ : మంత్రి తలసాని

మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ అధికారులతో సమావేశం జరిగింది.ఇప్పటి వరకు తెలంగాణా ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం 7.12 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. పెరిగిన చేపలను పట్టుకునేందుకు లైసెన్స్‌ పొందిన సుమారు 5,800 వేల మంది వరకు మత్స్యకారులు ఉన్నారని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తెలంగాణ మత్స్యకారుల పై తరచుగా దాడులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సంఘటనలను ప్రభుత్వం ఉపేక్షించ బోదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img