Friday, May 3, 2024
Friday, May 3, 2024

మహిళలకు ఆయుధాలు ధరించే హక్కు : స్మితా సబర్వాల్‌ ట్వీట్‌

జిల్లా కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలందుకున్న ఐఏఎస్‌ అధికారి స్మతా సబర్వాల్‌ ప్రస్తుతం సీఎంఓ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్‌ మీడియా వేదికగా పలు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తారు. అయితే, తాజాగా, ఆమె మన న్యాయ వ్యవస్థపై కొంత అసహనం వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారం కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. స్మితా సబర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మహిళలకు మద్దతుగా చేసిన ఆ వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ముందస్తు విచారణకు అవకాశం లేదనే కారణంతో గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన ఓ నిందితుడి శిక్షను గత వారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 25 ఏళ్లకు విధించిన శిక్షను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ రోహిత్‌ ఆర్య, జస్టిస్‌ రాజీవ్‌ కుమార్‌ శ్రీవాస్తవ ధర్మాసనం నిందితుడికి రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో సదరు నిందితుడు ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img