Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో ఈడీ దాడుల కలకలం.. 10 ప్రాంతాల్లో సోదాలు

నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌లో పలు కన్సల్టెన్సీ సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దాదాపు పది ప్రాంతాల్లో దాడులు కొనసాగుతోంది. వీసాలకు సంబంధించిన డిపాజిట్లపై కీలక విషయాలు ఈడీ రాబడుతోంది.

ఈడీ
హైదరాబాద్‌లో ఈడీ దాడులు కలకలం రేపుతోన్నాయి. నగరవ్యాప్తంగా దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు చేసి ఇద్దరు నిర్వాహకులను ఈడీ అరెస్ట్ చేసింది. అర్హత లేకపోయినా సరే నకిలీ సర్టిఫికేట్లు, తప్పుడు డిపాజిట్లతో కన్సల్టెన్సీ సంస్థలు వీసాలు ఇప్పిస్తున్నట్లు గుర్తించింది. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కన్సల్టెన్సీ సంస్థలు నడుస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. గచ్చిబౌలిలోని AూదీI లైక్ సైడ్ అపార్ట్‌మెంట్‌లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే Iఅ్‌aస్త్రతీఱ్‌ ్‌వషష్ట్రఅశీశ్రీశీస్త్రవ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలు సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img