Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

కేరళ ప్రభుత్వ ప్రశంసనీయ నిర్ణయం

డా. మార్క శంకర్‌ నారాయణ

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, షిప్పింగ్‌, విమానాశ్రయాలు, రైల్వేలు, బొగ్గు గనులు, రక్షణ, రోదసీ రంగాలను అమ్ముతున్న క్రమంలోనే కేరళలోని ఉత్తర కాసరగోడ్‌ జిల్లాలో భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌-ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌ లిమిటెడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుకు అమ్మడానికి సిద్ధపడిరది. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేస్తాయనే కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ ‘‘ప్రైవేటీకరణ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వరంగ సంస్థను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. మాది ప్రభుత్వరంగ సంస్థ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం’’ అని ఫేస్‌బుక్‌ వీడియోలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, విక్రయం, విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రశంసనీయమైన చర్య తీసుకున్నది. ప్రభుత్వరంగ సంస్థను కేంద్రం అమ్మకముందే కేరళ ప్రభుత్వం తీసుకొని దాన్ని కాపాడాలని నిర్ణయించుకొంది. ప్రభుత్వరంగ సంస్థలు కలకాలం వర్థిల్లాలనే గొప్ప లక్ష్యాలు ఉన్నాయి. ఉద్య మం విలువ, ప్రజల ప్రాణాల విలువ ఉద్యమ స్ఫూర్తి ఉన్నోళ్లకు, సహజ దేశ భక్తులకు, పోరాటాలే ఊపిరిగా జీవించే రాజకీయ పార్టీలకు మాత్రమే తెలుస్తుంది. స్వయంప్రకటిత దేశ భక్తులకు ఎన్నటికీ తెలియదు. చిత్రమైన విషయమేమిటంటే స్వాతంత్య్ర ఉద్యమంలో ఘనంగా పాల్గొన్నది మేమేనని చరిత్రను వక్రీకరించ గలరు. వాస్తవ చరిత్రను తొలగించే ప్రయత్నమూ చేయగలరు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేకున్నా, పోరాట వారసత్వమే లేకున్నా మేమూ పాత్రధారులమే అని చెప్పు కోవడానికి ఏ మాత్రం వెనుకాడని విషయాన్ని చూస్తూనే ఉన్నాం. గత పాలకులు డెబ్భై ఏండ్ల పాలనలో చెయ్యాల్సింది చేయలేదు కానీ అనేక ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వరంగ సంస్థలను నిర్మించింది గత ప్రభుత్వాలు కాదని ఎవరనగలరు. గత పాల కులు చేసింది ఏముందని ప్రశ్నించే ప్రస్తుత పాలకులు వాళ్ళు నిర్మించిన సకల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ నగదీ కరణ ద్వారా ఒకదాని తర్వాత ఒకటి అమ్ముతున్నది ముమ్మాటికీ నిజం. ఎల్లప్పుడూ శ్రమించే ప్రజల చెమట చుక్కలతో నిర్మించిన దేశ సంపదను ప్రయివేట్‌ కార్పొరేట్‌లకు అమ్మడం తెలుసు. చివరకు వాళ్ళు రోడ్లే కాదు గ్రామ పంచాయితీలు సైతం ప్రయి వేటోళ్లకు అమ్మగలరు. పైగా మేము అమ్ముతున్నట్లు మీరు కూడా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మండని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచి స్తున్నారు. ప్రజల అభివృద్ధికి ఏ మాత్రం ప్రయత్నించని, అది óకారమే ఏకైక లక్ష్యంగా ఎన్నుకున్న కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు అదేబాటలో పయనించడం శోచనీయమైన విషయం. నిజానికి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలను పరిపుష్ఠం చేస్తూ మరిన్నిటిని దేశమంతా నెలకొల్పినప్పుడే ఆ దేశ యువతకు ఉపాధి లభించడంతో పాటు, దేశ ఆర్థికస్థితి మెరుగు పడుతుందనేది చరిత్ర జెప్పిన సత్యం.
ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ప్రజల సంపద. ఈ సంపదను ప్రయివేటుకిచ్చినా, లీజుకిచ్చినా దేశ సంక్షేమానికి మంచి సంకేతం కాదన్న మాటలు ఏ కమ్యూనిస్టులో, ఏ వామపక్ష వాదులో అన్న మాటలు కాదు. సాక్షాత్తు తమిళనాడు ముఖ్య మంత్రి ఎం.కె.స్టాలిన్‌ అన్న మాటలు. భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఎనిమిది కేంద్ర ప్రాంతాల సమ్మిళితం. దేశ ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రులు, వివిధ శాఖల మంత్రులు దేశ సంపదంతా ప్రయివేట్‌పరం అయిపోతూ ఉంటే కనీసం నోరు విప్పక పోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని యువజన, విద్యార్థు లంతా గ్రహించాల్సిన అవసరం ఉంది. వివిధ సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎంతమాత్రమూ కాజాలదు. సకల ప్రభుత్వరంగ సంస్థలు ప్రయి వేటుపరం అయినప్పుడు ఉద్యోగాల్లో అన్ని రకాల రిజ ర్వేషన్స్‌ ప్రశ్నే లేదని కేంద్ర ప్రభుత్వమే చాలా విస్పష్టంగా పార్ల మెంటులోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రయివేటులో ఉద్యోగాలు బట్టకు, పొట్టకే ఉంటాయే తప్ప ఏ విధమైన వేతన స్కేళ్లు ఉండవు. ఉద్యోగ భద్రత తెరమరుగవుతుంది.
బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, షిప్పింగ్‌, విమానాశ్రయాలు, రైల్వేలు, బొగ్గు గనులు, రక్షణ, రోదసీ రంగాలను అమ్ముతున్న క్రమంలోనే కేరళలోని ఉత్తర కాసరగోడ్‌ జిల్లాలో భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌-ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌ లిమిటెడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుకు అమ్మడానికి సిద్ధపడిరది. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేస్తాయని కేరళ ముఖ్య మంత్రి విజయన్‌ ‘‘ప్రైవేటీకరణ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వరంగ సంస్థను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మాది ప్రభుత్వరంగ సంస్థ ప్రాము ఖ్యతను గుర్తించిన ప్రభుత్వం’’ అని విజయన్‌ ఫేస్‌బుక్‌ వీడియోలో పేర్కొన్నారు. రూ.43 కోట్లతో సహా మొత్తం రూ.77 కోట్లు ఖర్చు చేయడం ద్వారా స్వాధీనం చేసుకుంది. అధునాతన సౌకర్యాలతో కంపెనీకి తాజా జీవితాన్ని అందిస్తామని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా ఎలాంటి సంపాదన లేకుండా బాధ పడుతున్న కంపెనీ ఉద్యోగుల జీతాల బకాయిలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీని కోసం మొత్తం రూ.14 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. భారత ప్రజల బాగోగులు లౌకిక ప్రజాస్వామిక వామపక్ష శక్తుల ప్రభుత్వాలు మాత్రమే ఆ దిశలో అడుగులు వేస్తాయని మరోసారి రుజువైంది. అందుకే కేరళ ప్రభుత్వానికి పదివేల దండాలు, అభినందనలు. ఇదే బాటలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంపన్నుల వైపా! ప్రజల వైపా తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాస రచయిత సెల్‌ 9908416664

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img