Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ధర్మవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్య కుమార్ ఎంపిక

పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సందడి చేసుకున్న టిడిపి, బిజెపి శ్రేణులు

విశాలాంధ్ర ధర్మవరం:: గత కొన్ని రోజులుగా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో అన్న.. మాటకు ముగింపు వచ్చింది. జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి విడుదల చేసింది. వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎంపిక కొన్ని నెలల కిందటే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధర్మవరం ఎమ్మెల్యేగా పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ ఎమ్మెల్యే షీటును ఆశించారు. కానీ గత కొన్ని రోజులుగా నువ్వా? నేనా? అన్నట్టు సోషల్ మీడియాలో ప్రజల్ని కొంత వరకు ఇబ్బందులో పడేసింది. ఏది ఏమైనా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి బీసీకి బిజెపి పార్టీ టికెట్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం పట్ల అటు బిజెపి ఇటు టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, నేషనల్ కౌన్సిల్ నెంబర్ అంబటి సతీష్, అసెంబ్లీ కో కన్వీనర్ చట్టా నారాయణస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు జింక చంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేసు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి జిల్లా కార్తీక్ హర్షం కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధర్మారం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సత్య కుమార్ ప్రధానమంత్రి మోడీ సన్నిహితుడే అన్న ప్రచారం జరుగుతోంది. మోడీ కు, అమిత్ షాకు , దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాడని సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకునిగా పనిచేసిన అనుభవం ఉందని, అన్ని విధాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న సత్యకుమార్ గెలిస్తే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బిజెపి నాయకులు భావిస్తున్నారు. గత 34 సంవత్సరాలుగా బిజెపిలో కీలకపాత్ర వహించారన్న సమాచారం కూడా ఉంది. ఇక ధర్మవరం అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్య కుమార్ కు జనసేన, టిడిపి, బిజెపి శ్రేణులు సహాయ సహకారాలు అందిస్తే విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. టిడిపి జనసేనతో పొత్తులో భాగంగా పార్టీకి ఆరు లోకసభ, పది అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గంలో పలుచోట్ల బాణాసంచా కాల్చుతూ సంబరాలును ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు జరుపుకుంటున్నారు. ఉన్న 46 రోజుల్లో ప్రచారాన్ని ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మున్ముందు ప్రచార జోరును ప్రజలు చూడనున్నారు. నియోజకవర్గ ప్రజలు ఫ్యానుకు వేయాలా? పుష్పం (కమలం)గుర్తుకు వేయాలా? అన్న ఆలోచనలు మంచి నిర్ణయాలు తీసుకొని నాయకున్ని ఎన్నుకునే ఆలోచనలో పడ్డారు. గత కొన్ని రోజులుగా టిడిపి, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ, జనసేన లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరా? అన్న అనుమానానికి బుధవారంతో (27/3/2024) ముగింపు పడింది. ఎట్టకేలకు ఈనెల 28వ తేదీ నుండి ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు తమ తమ ప్రచార పోటీని వేగవంతం చేసే ఆలోచనలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరిని అధిక మెజార్టీతో ఎన్నుకుంటారు అనేది వజ్రాయుధం వంటి ఓటరు చేతుల్లో ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img