Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అర్చకుల పై దాడి చేసిన వాళ్ళు ఎంతటి వారైనా, తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

– దేవాలయం అర్చకులకు, పూజారులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి….
విశాలాంధ్ర – ఉమ్మడి విశాఖ (అనకాపల్లి జిల్లా, చోడవరం) : కాకినాడ జిల్లా, కాకినాడ పట్టణంలోని దేవాలయం వీది శివాలయంలో అర్చకులుగా పని చేస్తున్నటువంటి సాయి శర్మ, విజయ కుమార్ శర్మ లపై ఆలయంలోనే ఆ పరమేశ్వరుని సన్నిధిలో దాడికి పాల్పడడమే కాకుండా, ఆ అర్చకుల పై కాళ్లతో దాడి చేసినటువంటి మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు పై కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అర్చకులకు రక్షణ కల్పించాలని ఏ.పి.ప్రైవేట్ అర్చక పురోహిత సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా శాఖ డిమాండ్ చేస్తోంది. అర్చకులు, దేవాలయ పూజారులు పై జరిగిన దాడులను ఖండిస్తూ సంఘం జిల్లా బాధ్యులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాలయం అర్చకుల పై దాడులకు పాల్పడిన వారిని, అసాంఘిక కార్యకలాపాలకు రక్షణగా ఉన్నటువంటి అధికార ప్రభుత్వ పెద్దలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా దేవాలయాల పైన అర్చక పురోహితుల పైన నిరంతరం దాడులు జరుగుతున్నాయి అని, ఇది చాలా విచారకరమైనటువంటి విషయమని తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, అర్చకుల పైన పురోహితుల పైన దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనను, వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయకపోయినా, ఈ సంఘటన పై ఎటువంటి క్రమ శిక్షణ చర్యలు చేపట్టకపోయినను, ఏ.పి.ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరపున ప్రత్యక్ష పోరాటానికి అర్చక, పురోహితులు సిద్ధంగా ఉన్నామని, తదుపరి చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్రాహ్మణ సంఘాలు అర్చక పురోహిత స్వాముల ఉద్యమానికి మద్దతు ఇచ్చి, వారి పై దాడులను ఖండించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం కోరుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img