Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉగాది నాటికి గృహ నిర్మాణాల లక్ష్యాలు పూర్తిచేయాలి

విశాలాంధ్ర/పార్వతీపురం: పేదలు నిర్మిస్తున్న గృహాల నిర్దేశించిలక్ష్యాలను ఉగాదినాటికి త్వరితగతినపూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.యస్.జవహర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు వివిధదశలో ఉన్న ఇళ్లనిర్మాణాలను ఇంటి పైకప్పుదశ వరకు నిర్మాణాలు జరిపి ఉగాదిలోగా 5లక్షలలక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన క్రింద నిర్మిస్తున్న ఇళ్ళకి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చెరువుల అభివృద్ధికి చేపడుతున్న మానస సరోవర్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రాధాన్యతా భవనాలు పనుల పెండింగ్ బిల్లులను అప్ లోడ్ చేయాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా ఉచితంగా డస్ట్ బిన్ ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి విష్ణు చరణ్ , జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్టపాల్ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె. రామచంద్రరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజీ, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, జిల్లాసర్వే, భూరికార్డుల శాఖ అధికారి రాజకుమార్ , ఉద్యానవన శాఖ సహాయసంచాలకులు కె.సత్యనారాయణరెడ్డి, జిల్లావిద్యాశాఖ అధికారి ఎస్.వి.రమణ, జిల్లా పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా సూక్ష్మ నీటి సంస్థ అధికారి ఎల్.శ్రీనివాసరావు, ముఖ్య ప్రణాళికా అధికారి పి. వీరరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img