Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

న్యాయశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారులతో మోసపోవద్దు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి

విశాలాంధ్ర – విజయనగరం : .

నాయ్య శాఖ లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే మధ్యావర్థుల మాటలు నమ్మవద్దని లేని పోనీ ప్రలోభాలకు గురికావద్దని నిరుద్యోగులు చక్కగా చదివి పోటీ పరీక్షలలో మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు పొందవచ్చునని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని గౌ శ్రీ బి. సాయి కళ్యాణ్‌ చక్రవర్తి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గారు తెలియజేసిరిఇటీవల న్యాయశాఖలో భారీ ఎత్తున ఖాళీలు భర్తీచేయుటకు గౌరవ హైకోర్టు వారు నోటిఫికేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుచున్నది. అలాంటి ప్రచారాన్ని,వ్యక్తులను నమ్మి ఎవరు డబ్బులు ఇచ్చి మోసపోకూడదని అభ్యర్ధులను హేచ్చా రిస్తూ న్నారు న్యాయశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారని గాని, అడుగుచున్నారని తెలిస్తే జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి కి వెంటనే తెలియజేయాలన్నారు.న్యాయశాఖలో అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టడం జరుగుతుందని కనుక అభ్యర్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణులైన వారు మాత్రమే న్యాయశాఖలో ఉద్యోగాలు పొందగలరని డబ్బులకు, పైరవీలకు న్యాయశాఖలో చోటు ఉండదని మరియు అటువంటి మధ్యావర్థులు ఎదురైనచో ప్రధాన న్యాయమూర్తి గారు ద్రుష్టి కి తీసుకు రావాలెనని హితవు పలికిరి, మోసపూరితమైన చర్యలకు పాల్పడిన వారిని న్యాయ స్థాన%శీ% విధించే కఠిన శిక్షలకు గురియగూదురని హేచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img