Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాఠశాల నిర్వహణ నిధులు విడుదల చేయాలి: జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం : పాఠశాల నిర్వహణ నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డిని కోరారు. గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొన్నిపాఠశాలలకు పాఠశాలనిర్వహణ నిధులు విడుదల చేయాల్సిఉందని, వాటిని విడుదల చేయాలని కోరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ విడుదల చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ
రక్తహీనతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మెరుగుపరుచుటకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణాలకు మౌళిక సదుపాయాల కల్పన చేయాలని ఆయన సూచించారు. పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమం సంతృప్తిమేరకు ఉండాలన్నారు.
ఈవీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ ఓ. ఆనంద్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణుచరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి విజయ గౌరి, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీరరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img