Friday, May 3, 2024
Friday, May 3, 2024

మహాశివరాత్రికి పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు

జిల్లా ఎస్పీ విద్యాసాగర్

విశాలాంధ్ర,పార్వతీపురం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రముఖ శివాలయాల్లో పటిష్టభద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. 400మంది పోలీస్ సిబ్బందితో జిల్లావ్యాప్తంగా ఉండే ఐదు ప్రముఖ శివాలయాలయందు గట్టిభద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకొని భక్తులకు సురక్షితమైన, సులభమైన దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఇదేసమయంలో విఐపిలకు కూడా తగిన సమయం కేటాయించడం జరిగిందన్నారు అలాగే ఊరేగింపు సమయంలో మాడవీధులలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసామన్నారు.
వాహనాల పార్కింగ్, దారిమళ్లింపు ఉన్న ప్రతీచోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ఎంట్రీ డ ఎగ్జిట్ గేటుల వద్ద భక్తులకు సమాచారం పూర్తిగా తెలిసేలా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రెవెన్యూ యంత్రాంగం, దేవాదాయశాఖ ప్రోటోకాల్ సిబ్బంది, మున్సిపల్ తదితర సంబంధితశాఖల వారితో సమన్వయం చేసుకుంటూ పోలీసుశాఖ విధులు నిర్వర్తిస్తుందన్నారు శివరాత్రి సందర్భంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేఅవకాశం ఉన్నందున చోట మహిళా పోలీసు సిబ్బంది, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఐసిడిఎస్ అధికారులు సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చుట్టుప్రక్కలలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు గురించి అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తూ బాల్యవివాహాలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img