Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సారె క్రింద 58 రకాల స్వీట్లును దేవునికి సమర్పించిన గోపాలకృష్ణ- భారతి దంపతులు

విశాలాంధ్ర-సీతానగరం: మండల కేంద్రంలోని సువర్ణముఖినదీ తీరానగల  రుక్మిణీ సత్యభామసమేత శ్రీవేణుగోపాల స్వామిదేవాలయంతో పాటు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలలో దశమ వార్షిక మహోత్సవములు మూడో రోజు గురువారం నాడు ఘనంగా జరిగాయి.గురువారం ఉదయం నిత్యారాధనం, నిత్య హోమములు, తీర్థ ప్రసాదగోష్ట కార్యక్రమాలు జరగడంతో పాటు ప్రతీ గురువారం జరిగే శ్రీలక్ష్మి నరసింహస్వామీ వారికి జరిగే ముడుపులు పూజలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలు,పరిసర ప్రాంతాలు కిటకిట లాడాయి. సాయంత్రం ఆలయ నిర్వహకులు చెలికాని గోపాల కృష్ణ భారతి దంపతులు దేవునికి సమర్పించిన సారె కార్యక్రమంను ఘనంగా వేదమంత్రాల సాక్షిగా పురోహితులు నిర్వహించారు. దీన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.అనంతరం
శ్రీవేణుగోపాలస్వామి, శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, తీర్ధ ప్రసాదగోష్ట కార్యక్రమాలు నిర్వహించారు.ఈకార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులుతోపాటు ఆమంచి శ్రీనివాసాచార్యులు, పీసపాటి రామానుజాచార్యులు, కె.మురారి,బృందావనం ఉదయ కృష్ణమాచార్యులు, శ్రీనివాసా చార్యులు పాల్గొని పూజలు, కల్యాణాన్ని నిర్వహించారు. నేటితో ముగియనున్న దశమ వార్షికోత్సవ వేడుకలు: దశమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారంతో ముగుస్తాయని అర్చకులు శ్రీనివాసా చార్యులు తెలిపారు. శుక్రవారం నిత్యారాధనం, నిత్యహోమములు, చూర్ణోత్సవం, వసంతోత్సవం,
సువర్ణముఖీనదిలో చక్రస్నానోత్సవం, తీర్థ ప్రసాదగోష్ట, ద్వాదశారాధనలు, పూర్ణాహుతి, ధ్వజపతాక విసర్జన, పవలింపుసేవ తీర్థ ప్రసాద గోష్ట ఉంటుందని తెలిపారు.ముగింపు రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామీ వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img