Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సిటిజెన్ ఔట్ రీచ్ సర్వే 84 శాతం పూర్తి

జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విశాలాంధ్ర – విజయనగరం
: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు పై ప్రజల అభిప్రాయాన్ని సేకరించే సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమం జిల్లాలో 84 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 30, 31 తేదీలలో ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందని, ఈ సర్వే లో పథకాలు సక్రమంగా అందుతున్నదీ, లేనిదీ, సచివాలయ సేవలు సకాలం లో అందుతున్నదీ లేనిదీ, వాటి నాణ్యత ఎలా ఉంది, వాలంటీర్ సేవలు ఏ విధంగా అందిస్తున్నారు తదితర అంశాల పై లబ్ధిదారుల నుండి అభిప్రాయ సేకరణ చేయడం జరిగిందన్నారు. ఎం.పి.డి.ఓ లు, మున్సిపల్ కమీషనర్ల అద్వర్యం లో లైన్ డిపార్ట్మెంట్ ల తో మండల బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికీ సర్వే చేసి సంక్షేమ పథకాల అమలు, సచివలయాల ద్వారా అందుతున్న సేవల పై అడిగి తెలుసుకోవడం జరుగుతోందన్నారు. జిల్లాలో 6,29,135 కుటుంబాలకు గాను 5,24,845 కుటుంబాలను ఈ సర్వే ద్వారా కలుసుకొని, వారి అభిప్రాయాలను తెలుకోవడం జరిగిందని తెలిపారు. సర్వే వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ నందు అప్లోడ్ చేయడం జరుగుతోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img