Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యువత వ్యవసాయం వైపు అడుగులు వేయాలి: డీసీఎంఎస్ చైర్‌పర్సన్‌ డా. అవనాపు భావన

విశాలాంధ్ర -విజయనగరం :

  అందరి సహకరంతో డిసిఎమ్ఎస్ లాభాల బాటలో పయనిస్తోందని ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (DCMS) చైర్‌ పర్సన్ డాక్టర్ అవనాపు భావన  స్పష్టం చేసారు. గత ఏడాది 19 కోట్ల టర్నోవర్ సాదిస్తే ఈ ఏడాది 21 కోట్ల టర్నోవర్ సాధించామని చెప్పారు. డిసిఎమ్ఎస్ కార్యాలయంలో మంగళవారం మహాజన సభ జరిగింది. ముందుగా సభకి విచ్చేసిన అతిధులకు, డీసీఎంఎస్ డైరెక్టర్లకు, పీ ఏ సి ఎస్ సభ్యులకు శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపి, డిసిఎంఎస్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేల సహకరం మరువలేనిదని భావన గారు కొనియాడారు. రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్ ఆశయానికి అనుగుణంగా నేడు డిసిఎంఎస్ పని చేస్తోందని అన్నారు. సభ్యుల సహకరంతో ఎన్నో అభివృద్ధి,సేవ,ఉపాధి ఇలా అన్ని రకాల కార్యక్రమాలు డిసిఎంఎస్ ద్వారా చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు టెక్స్‌ టైల్స్ రంగంలో శిక్షణ, ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడం,ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు డిసిఎమ్ఎస్ శ్రీకారం చుట్టిందన్నారు. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది ఎంత వాస్తవమో..మనిషి ఎంత అభివృద్ధి చెందినా తిరిగి వ్యవసాయం వైపు రావాలన్నది కూడా అంతే నిజమని భావన అభిప్రాయపడ్డారు. యువత కూడా వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, సాంకేతిక సహకారంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించాలని  పిలుపునిచ్చారు. భూమిని నమ్ముకున్న వారెవరూ కూడా చెడిపోలేదని డిసిఎంఎస్ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో  డిసిసిబీ చైర్మన్ వి.చినరామునాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ డిప్యుటీ డైరెక్టర్ అన్నపూర్ణా దేవి, డీసిఓ అప్పలనాయుడు, మార్క్ ఫెడ్ జిల్లా అధికారి విమల, డిసిఎమ్ఎస్ డైరెక్టర్లు, పీ ఏ సి ఎస్ సభ్యులు పాల్గొన్నారు. సభలో ఆర్గానిక్ ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే విధానం, దాని వలన కలిగే లాభాలు గూర్చి  తెలుసుకునేందుకు సభ్యులు ఆశక్తి కనబర్చారు. చిరుధాన్యాలు,వాటితో చేసిన ఆహార పదార్ధాల స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img