Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

రెండో రోజున పెదబోగిలిలో కొనసాగిన గడపగడపకు మనప్రభుత్వ కార్యక్రమం

విశాలాంధ్ర-సీతానగరం : మండలంలోని  పెదబోగిలి-1 గ్రామసచివాలయంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో శనివారంనాడు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం రెండో రోజున కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు.227వ రోజున 68వ సచివాలయంలో జరిగిన కార్యక్రమానికి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జోగారావుకు  ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, వైఎస్సార్సీపీ కన్వీనర్లు స్థానిక ప్రజలు రెండో రోజున కూడా ఘన స్వాగతం పలికారు.ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమం ప్రారంభించి ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలను తెలుసుకోవడంతోపాటు అభివృద్ధి పనులు, సంక్షేమం చూసి తనను, రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డికి అశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సవ్యంగా అందుతున్నదీ లేనిదీ తెలుసుకుని మీఅందరికీ మంచి చేయాలన్నదే జగన్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.ఎవరికి ఏసమస్య ఉన్నా తక్షణ పరిష్కారంచేసి చూపడం జరుగుతుందన్నారు.  ఎమ్మెల్యే ప్రజలకు హామీఇస్తూ ప్రజా సమస్యలను సహితం వారి ముంగిటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వారి సమస్యలను క్షుణ్నంగా తెలుసుకొని పరిష్కారం చేసే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ గడపలో వారితో మమేకమై కుశల ప్రశ్నలు అడుగుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అనూహ్య స్పందన లభించినట్లు ఎమ్మెల్యే జోగారావు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండల పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, ఎంపీటీసీలు సురగాల గౌరీశ్వరి కిరణ్, బురిడి సూర్యనారాయణ, పెదభోగిలి నాయకులు ఆర్వీ పార్థసారది, మండల కన్వీనర్ యు.సురేష్, పిఎసిఎస్ ప్రెసిడెంటు సాకేటి కూర్మారావు, పిల్లి సతీష్ కుమార్, కొల్ల శ్రీను,నానారావు, ఇజ్జాడరాంబాబు, ఇజ్జాడ సింహాచలం, ఇజ్జాడ లక్ష్మణరావు, ఎస్.రమేష్, కొల్ల చక్రి, దండి నూకం నాయుడు, దేవదానం,కొల్ల గోవింద్, పిన్నింటి రామారావు,సుంకరి అప్పారావు, పైడిపునాయుడు, ఎం.వెంకన్న, సురగాల.వినోద్, పెంకి ప్రసాద్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు  పోల ఈశ్వరనారాయణ, తెంటు వెంకటఅప్పల నాయుడు, కురమాన శ్రీనివాసరావు, నారాయణరావు,అల్లు తిరుపతిరావు, పెంట సూర్యనారాయణ, వెంకట రమణ, చింతాడ కృష్ణ, మండల త్రినాథ, ఏగిరెడ్డి శ్రీను,సురేష్,ముకుంద, గౌరునాయుడు, ఏగిరెడ్డి గోపాల్,గోట్టాపు అప్పారావు,తదితరలతోపాటు మండల అధికారులు, రెండు సచివాలయంల సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు,సీతానగరం, పెదభోగిలి, అప్పయ్యపేట, బుడ్డిపేట, గ్రామపెద్దలు పాల్గొన్నారు. మరో రెండురోజుల పాటు ఇదే గ్రామపంచాయతీలో కొనసాగుతుందని ఎమ్మెల్యే జోగారావు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img