Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024
జిల్లా కలెక్టరును ఘనంగా సత్కరించిన జిల్లా అధికారులు




 విశాలాంధ్ర,పార్వతీపురం:  సమష్టి కృషితో అన్నిరంగాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లాకు అవార్డులు సాధించినందుకుగాను స్థానిక రాయల్ కన్వెన్షన్ సెంటరు నందు జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ ను జిల్లాఅధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంను ఏర్పాటుచేసారు. మన్యం జిల్లా,సీతానగరం మండలం జోగింపేట గ్రామ పంచాయతీకి జాతీయస్వచ్ఛ పురస్కారం, జాతీయ స్థాయిలో నీతి అయోగ్ వివిధరంగాల అభివృద్ధి సాధించుటకు ఆశావాహ జిల్లాలలో జిల్లా ఉత్తమస్థానం అవార్డులు దక్కించుకున్న  సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఐటీడిఏ ప్రోజెక్టు ఆఫీసర్ విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు,పాలకొండ సబ్ కలక్టర్ నూరుల్ మహల్,జిల్లాఅధికారులు కలిసి ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో జిల్లాకలెక్టరు మాట్లాడుతూ   నూతనంగా ఏర్పడిన జిల్లాలో కనీస వసతులతో ప్రస్థానం ప్రారంభం చేసామని, సంవత్సరకాలంలో జాతీయస్థాయిలో  నాలుగు అవార్డులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని అధికారుల సమిష్టి కృషితో,సహకారంతో  సాధ్యమైందన్నారు.ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణతలో కూడా జిల్లాలో అందరి సహకారంతో రాష్ట్రంలోని మొదటి స్థానాన్ని దక్కించుకోవడం జరిగిందన్నారు.గతసంవత్సరం వైద్య ఆరోగ్యశాఖకు, సాలూరు మున్సిపాలిటీకీ జాతీయ అవార్డులురాగా, ప్రస్తుతం  జోగింపేట పంచాయతీకి జాతీయ స్వచ్ఛ పురస్కారం, నీతి అయోగ్ ఆశావాహ జిల్లాలలో జిల్లా ఉత్తమ స్థానం సాదించుటలో కృషిచేసిన అధికారులను అభినందించారు.  ప్రజలజీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే అధికారులు కష్టపడి పనిచేయాలన్నారు.సంవత్సర కాలంలో జిల్లాలో పదివేల ఇళ్ళు నిర్మించామని, మారుమూల ప్రాంతాలకు రోడ్డు, ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించామన్నారు.  27రోడ్లకు అటవీ శాఖ అనుమతులు సాధించామన్నారు. జిల్లాను అబివృద్ధి చేయటంలో కష్టపడి పనిచేస్తున్న జిల్లా అధికార బృందానికి అభినందనలు తెలిపారు. అందరి సమిష్టి కృషితో అన్నిరంగాల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్ లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి  జిల్లాను అభివృద్ధి బాటలో కొనసాగించాలని కోరారు.
జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ  జిల్లా కలెక్టర్ గారితో కలిసి పనిచేసిన అనుభవంఉందని, ఏదైనా పనిని పూర్తి చేయడానికి  వారు రూపొందించే ప్రణాళికలే కీలకమని, సమస్యలను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారం కనుగొంటారని  తెలిపారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ మాట్లాడుతూ కలెక్టర్ జిల్లాలో మంచి టీంను ఏర్పాటు చేశారని, కొత్తగాఏర్పడిన మారుమూల  మన్యంజిల్లాలో ఇటువంటి బృందంతో కలిసి ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.  భవిష్యత్ లో కూడా యిదే స్ఫూర్తి కొనసాగాలని కోరారు.కార్యక్రమంలో  పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణుచరణ్ , పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్,   అదనపు ఎస్పీ డాక్టరు ఒ.దిలీప్ కుమార్, డి. ఎఫ్. ఒ. ప్రసన్నలు మాట్లడుతూ జిల్లా అబివృద్ధిలో  జిల్లా కలెక్టర్  నాయకత్వం, వారుఅందించిన సూచనలు, సలహాలు, సమస్యలపై ఉన్నతాధికారులతో  మాట్లాడి పరిష్కారం చేయడం వలన సాధ్యమైనదన్నారు.  కొత్తగా సర్వీస్ లోనికి వచ్చిన తమకు విధులపై అవగాహన కల్పించి, మార్గదర్శకులుగా నిలిచారన్నారు. జిల్లాలో ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొంటూ అప్రమత్తం చేస్తూ వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారమార్గాలు చూపిస్తారని తెలిపారు.జిల్లారెవిన్యూ అధికారి  జె. వెంకటరావు మాట్లాడుతూ  జిల్లా అభివృద్ది సాధించుటలో అధికారులకు జిల్లాకలెక్టరు నాయకత్వం, అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.  జిల్లా కలెక్టర్  కృషితో జాతీయ అవార్డులు సాధించామని, జిల్లా లో మారుమూల ప్రాంతాలకు రోడ్లు, మొబైల్ టవర్స్  ఏర్పాటు చేసి అనుసంధానం చేశారన్నారు.  రాష్ట్ర స్థాయిలో పదవతరగతి ఉత్తిర్ణతశాతంలో  మొదటి స్థానం సాధించామని తెలిపారు. జిల్లా కలెక్టరు మార్గదర్శకత్వంలో మరిన్ని విజయాలు సాధించాలని తెలిపారు.ఈకార్యక్రమంలో పార్వతీపురం ఆర్డీఓ కె. హేమలత,  సివిల్ సప్లై జిల్లా మేనేజర్ దేవుళ్ళ నాయక్, జిల్లా సరఫరా అధికారి మూర్తి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి, డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్,  జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, జి సి సి డివిజనల్ మేనేజర్  వీరేంద్ర కుమార్, జిల్లా మహిళా శిశుసంక్షేమఅధికారి కె. విజయ గౌరి, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీరరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు, ఇతర జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img