Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏపీటీఎఫ్ ఉద్యమఅధ్యయన తరగతుల సదస్సులను విజయవంతం చేయాలి

విశాలాంధ్ర-పార్వతీపురం: బుదవారంనాడు జిల్లా కేంద్రంలోని చిలకల పల్లి సీతారామస్వామి పెన్షనర్ల సంఘ భవనంలో ఏపీటీఎఫ్ ఉద్యమ అధ్యయన అవగాహణ తరగతులను విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యంజిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్ దుర్గారావు, నల్లా బాలకృష్ణలు తెలిపారు. ఈఅధ్యయన తరగతులను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ ప్రారంభిస్తారని తెలిపారు.  ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కొప్పల భానుమూర్తి, ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు షేక్ జిలాని పాల్గొంటారని తెలిపారు.
ఈసదస్సును రెండు పూటలా నిర్వహిస్తామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యమ చరిత్ర నిబంధనావళిని,ప్రస్తుత విద్యారంగ పరిస్థితులు-ఉపాధ్యాయుల కర్తవ్యం, ఐక్య ఉద్యమాలలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పోషిస్తున్న పాత్రపై పలువురు అవగాహన కల్పిస్తారని తెలియజేశారు. ఈ అధ్యయన తరగతుల్లో ఏపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లానేతలు ఎం వి గౌరీ శంకర రావు, రావాడ అప్పలనాయుడు, డి వేణు గోపాలరావు, పి ఎస్ ప్రకాశరావు, రౌతు వాసుదేవరావు, బంకురు జోగి నాయుడు, రౌతు తవిటినాయుడు, బెహరా గుంప స్వామి, బాలగుడబ కృష్ణ, కె పద్మజ, వి.ప్రమీలరాణి, టి. ఉమామహేశ్వరరావు, గుంట్రెడ్డి శ్రీనివాసరావు, గోగుల సూర్యనారాయణ, ముక్తేశ్వర పాణీగ్రహీ తదితరులు పాల్గొంటారని తెలిపారు.పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడినతర్వాత ప్రప్రధమంగా నిర్వహిస్తున్న ఈఉద్యమ అధ్యయన తరగతులను విజయవంతం చేయాలని అధ్యక్ష, కార్యదర్శిలు దుర్గారావు, బాలకృష్ణలు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img