Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

భారతదేశ ఆరాధ్య దైవం బిఆర్ అంబేద్కర్..

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: భారత దేశ ఆరాధ్య దైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పరింపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి పేర్కొన్నారు. స్థానిక ఎస్ సి కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ యూత్ అధ్యక్షుడు బొబ్బర చిట్టిబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ విజయ కుమారి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే నేడు బడుగు బలహీన అణగారిన వర్గాల వారికి ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందన్నారు. రాజ్యాంగంలో రచించిన రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు, పదవులు ,పథకాలు, వస్తున్నాయని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ఏలేటి భాస్కరరావు ,పూలపల్లి రవికుమార్ , ముప్పిడి వెంకట్రావు (లాయర్) ముప్పిడి చిన్నబాబు, పూలపల్లి వెంకటరావు, కండెల్లి శివ ,తమిర్చి వెంకటేష్ ,బొబ్బర మంగరాజు, పులపాకుల దుర్గారావు ,ఊసల రాజేష్, ముప్పిడి అశోక్, పాత కాకుల శ్రీను, గెల్లా సోమరాజు, ముప్పిడి రమేష్, నక్కపల్లి సురేష్ బొబ్బర చిట్టిబాబు ,పూలపల్లి కృష్ణబాబు, బొబ్బర జయషిల్, ఊసర తేజస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img