Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మోటార్లకు మీటర్లు రైతులకు ఉరితాళ్లు…

విశాలాంధ్ర -కొయ్యలగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టడం రైతులకు ఉరి తాళ్లు బిగించడమేనని టిడిపి మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపును, రైతుల మోటార్లుకు మీటర్లు పెట్టాదాన్ని నిరసిస్తూ గవరవరం గ్రామంలో ఉన్న సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా పారేపల్లి నరేష్ మాట్లాడుతూ ఒకపక్క నిత్యావసర ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులో ఉన్న సామాన్య ప్రజలకు, రైతులకు విద్యుత్ చార్జీల పెంచడం మునిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతుల పొలాల్లో మీటర్లు బిగించడం రైతులను ఆత్మహత్యకు పురికొల్పడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించకపోతే రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యాగంటి హరిబాబు,మాజీ సర్పంచ్. మల్లవారపు తిమూర్తులు,సీనియర్ నాయకులు గోపిన గోపాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి బొబ్బర చిన్నారాజు, గ్రామ ప్రధాన కార్యదర్శి అమరవరపు తాతరావు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి నల్లూరి గోపికృష్ణ, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చింతల వెంకటరమణ,జిల్లా కార్యదర్శి బెల్లని శ్రీను, మండల తెలుగు రైతు అధ్యక్షులు రౌతు శ్రీను, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img