Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతి….

టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి…

విశాలాంధ్ర- ఏలూరు : ప్రజా సమస్యలు మరచి తుగ్లక్ పాలన సాగిస్తున్న జగన్ కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్ పేట లోని టిడిపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలను ఆయన ప్రస్తావించారు. గడిచిన 6 నెలల కాలంలో ఏలూరులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మొత్తం 60 వేల ఇళ్లను సందర్శించడం జరిగిందని, ఈ సందర్భంగా 49 వేల కుటుంబాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కరపత్రం రూపంలో రాసి తమకు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైన్లు సక్రమంగా లేదని పలువురు ఆరోపించారని, గత టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత పాలకులు చేసింది ఏమీ లేదని ప్రజలు పేర్కొన్నట్లు బడేటి చంటి తెలిపారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై చేతులు ఎత్తేసిన వైసిపి ప్రభుత్వం చివరి రోజుల్లో చేసేదేమీ లేదని ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు. కనీసం పేదలకు టిడ్కో ఇళ్ళు ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉండటం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి హయంలో 80 శాతం పూర్తయిన ఇళ్లను కూడా పేదలకు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండటం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ఎంతోమందికి ఉపాధి కల్పించే ఏలూరు జూట్ మిల్లు మూతపడినా దాన్ని తెరిపించే విషయంలో స్థానిక ప్రజాప్రతినిధి చొరవ చూపకపోవడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అని ఆయన ఎద్దేవా చేశారు. హడావుడిగా ఏలూరు కార్పొరేషన్ లోకి 7 గ్రామాలను కలిపిన ప్రజాప్రతినిధులు విలీన గ్రామాల ప్రజలను గాలికి వదిలేసారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలీన గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, పైగా అధిక పన్నులు విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ చేతకానితనం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అధోగతి పాలైందని, పేదల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని బడేటి చంటి ఆవేదన వ్యక్తం చేశారు. వైనాట్ 175 అని ప్రగల్బాలు పలికిన వారు ఇప్పుడు ఒక స్థానానికి పరిమితమయ్యే పరిస్థితి దాపురించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఓటు వేస్తారన్న నమ్మకం కోల్పోయిన జగన్ తీవ్ర నైరశ్యంలో చిక్కుకున్నారని బడేటి చంటి ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోయారని పేర్కొన్నారు. ప్రజా చైతన్యం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్న నిర్ణయంతో తాము నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో విజయవంతమైందని బడేటి చంటి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాలి ప్రసాద్,చోడే వెంకటరత్నం, పెద్దిబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ, నేరుసు గంగరాజు, లంకలపల్లి మాణిక్యాలరావు, మారం హనుమంతరావు, జంప సూర్యనారాయణ, పిల్లారిశెట్టి సంధ్య సురేష్, అర్నేపల్లి తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img