Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

లోకేష్ పై తప్పుడు ప్రచారాలు మానండి…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: అధికార పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకొని తప్పుడు ప్రచారాన్ని కట్టిపెట్టి తక్షణం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు క్షమాపణ చెప్పాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి డిమాండ్ చేశారు.లోకేష్ చేపట్టిన యూవగళం పాదయాత్ర సందర్భంగా ఒక సభలో మాట్లాడుతూ దళితులు చేసిందేమీ లేదు అని ఒక ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేయడం దారుణమైన విషయమని వాఖ్యానించారు. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం, సాక్షి పత్రికలో దీనిపై వార్తను ప్రచురించడం దారుణమని ఖండించారు. టిడిపికి దళిత వర్గాల ప్రజలు అంటే ఎంతో అభిమానం ఉండబట్టే వారి అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందన్నారు.చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆమె అన్నారు. అయినా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, నారా లోకేష్ దళితులను అవమానించారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయన్నారు. ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం గుర్తెరిగి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img