Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శ్రమజీవుల రాజ్యానికి బాటలు వేసిన రష్యన్‌ విప్లవం….

సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు…
విశాలాంధ్ర`భీమవరం : ప్రపంచంలో పెట్టుబడి దారుల దోపిడీ అంతానికి శ్రమజీవుల రాజ్యానికి బాటలు వేసిన మహత్తర విప్లవం 1917 రష్యన్‌ సోషలిస్టు విప్లవమని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు.రష్యన్‌ సోషలిస్టు విప్లవం 105 వ వార్షికోత్సవాన్ని సోమవారం భీమవరంలో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కమ్యూనిస్టు ఉద్యమ పితామహులు కారల్‌ మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌ ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, పెట్టుబడి దారుల దోపిడీ అంతానికి కారల్‌ మార్క్స్‌, ఎంగెల్స్‌లు రచించిన కమ్యూనిస్టు, మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికగా రష్యాలో లెనిన్‌ మహాశయుడు కార్మికులను, రైతులను ఏకం చేసి సోషలిస్టు సమాజ స్థాపన దిశగా విప్లవోద్యమం నిర్మించి రష్యన్‌ జార్‌ చక్రవర్తుల నిరంకుశ, దోపిడీ పాలన అంతమెందించి సోషలిస్టు సమాజాన్ని నెలకొల్పి శ్రమజీవుల రాజ్యానికి బాటలు వేశారన్నారు. రష్యన్‌ సోషలిస్టు విప్లవ స్ఫూర్తితో చైనా, వియత్నాం, క్యూబా లాంటి అనేక దేశాల్లో పెట్టుబడి దారుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించి సోషలిస్టు ప్రభుత్వాలను నెలకొల్పుకోవడం జరిగిందన్నారు.రష్యన్‌ సోషలిస్టు విప్లవ స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ తో సహా అనేక దేశాల్లో కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు ఆవిర్భావించాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించి శ్రమజీవులు హుక్కులు సాధించి కోవడం జరిగిందన్నారు. సీపీఐ భీమవరం పట్టణ కార్యదర్శి సిహెచ్‌ రంగారావు మాట్లాడుతూ రష్యన్‌ సోషలిస్టు విప్లవం బానిసత్వ విముక్తికి నాందీగా నిలిచిందన్నారు.సోషలిస్టు విప్లవ ఉద్యమ స్ఫూర్తితో నరేంద్రమోడీ పాలనలో హరించబడిన కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలన్నారు.సీపీఐ భీమవరం మండల కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్‌ మాట్లాడుతూ రష్యన్‌ సోషలిస్టు విప్లవం ప్రపంచంలో పెట్టుబడిదారీ సమాజం వెన్నుల్లో వణుకు పుట్టించిందన్నారు.శ్రమ జీవుల పోరాటాలకు స్ఫూర్తి నిచ్చిన మహత్తర విప్లవమన్నారు.మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాస్‌, యేలేటి విజయానంద్‌, ఆకలి రాము,తిరుమాని కామేశ్వరరావు,పాలా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img