Friday, May 3, 2024
Friday, May 3, 2024

చదువులోనూ ఐశ్వర్యమే….

సి ఏ ఫౌండేషన్ లో ప్రతిభ చాటిన ఐశ్వర్య…

రాష్ట్రస్థాయిలో ర్యాంకు….

సంతోషంలో కుటుంబ సభ్యులు….

విశాలాంధ్ర -తాడేపల్లిగూడెం రూరల్ :చార్టర్డ్ ఎకౌంటెంట్ ఎట్రన్స్ (సిఎ) ఫౌండేషన్ కోర్సులో ఉంగుటూరు మండలం పెద వెల్లమిల్లికి చెందిన రాయుడు ఐశ్వర్య అత్యంత ఁప్రతిభ కనబరిచి ర్యాంకు సాధించించింది . దేశ వ్యాప్తంగా జూన్ నెలలో నిర్వహించిన ద ఇనిస్టిట్యూట్ చార్టర్డ్ ఎకౌంటెంట్ ఆఫ్ ఇండియా మంగళవారం విడుదల ఫలితాల్లో రాయుడు ఐశ్వర్య అర్హత సాధించింది. ఈ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా లక్షా 3వేల 515 మంది పరీక్ష రాయగా అందుల్లో 25వేల మంది మాత్రమే అర్హత సాధించారు. ఐశ్వర్య పేరుకు తగ్గట్టుగానే చదువులను ఐశ్వర్యంగా కొనసాగుతుంది పదవ తరగతిలో ప్రథమ స్థానం సాధించింది అలాగే ఐశ్వర్య తాడేపల్లిగూడెంలోని ఆదిత్యా జూనియర్ కళాశాలలో ఎంఈసి చదివి పట్టణ రెండో ర్యాంకు సాధించినది సుమారు ఆరు నెలలుగా కృషి పట్టుదలతో చదివి సీఏ ఫౌండేషన్ ఎంట్రన్స్ పరీక్షల్లో ప్రతిభ చాటింది. తద్వారా సీఏ ఇంటర్ చదివేందుకు అర్హత సాధించింది. తాను చార్టర్డ్ ఎకౌంటెంట్ ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే లక్ష్యం అని ఐశ్వర్య తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు ఐశ్వర్య తండ్రి పౌలుకుమార్ వ్యవసాయకూలి కాగా, తల్లి మాలతి గృహిణి
వారికి ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె సౌందర్య ఆదిత్య జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది ఇద్దరు కుమార్తెలను ఉన్నత విద్యావంతులుగా తిర్చిదిద్దాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img