Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం నులి పురుగులను నిర్మూ లిద్దాం…

జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి….

విశాలాంధ్ర- భీమవరం: నులి పురుగుల నివారణలో భాగంగా చెన్నరంగనిపాలెం పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో గురువారం చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను జిల్లా కలెక్టరు వేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణలో భాగంగా ఒకటి నుండి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు తప్పక వేసుకోవాల న్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలు, కళాశాలు, వివిధ వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, , అపరిశుభ్రత చేతుల ద్వారా ఆహారం తీసుకుంటే లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని ఆమె అన్నారు. ఆహారం తీసుకునే సందర్భాల్లో ఖచ్చితంగా విద్యార్థులు శుభ్రతను తప్పక పాటించాలన్నారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. అల్బెండో జోల్ మాత్రలతో వీటికి చెక్ పెట్టి ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని జిల్లా కలెక్టరు తెలిపారు.నా భూమి-నా దేశం, నేల తల్లికి వందనం, వీరులకు వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.అనంతరం నా భూమి-నా దేశం, నేల తల్లికి వందనం – వీరులకు వందనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులుచే జిల్లా కలెక్టరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె అన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనతో పాఠశాలల రూపురేఖలు మారాయని ఆమె అన్నారు. దేశం కోసం చేసే ప్రతిజ్ఞ ద్వారా దేశం రుణం తీర్చుకోవాలని, తల్లి తండ్రులను, పుట్టిన గ్రామాన్ని మరువరాదని ఆమె అన్నారు. విద్యార్థి దశలోనే ఒక రంగాన్ని ఎంచుకుని ప్రతిభ చూపుతూ, చదువులో బాగా రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టరు అన్నారు.చెన్నరంగనిపాలెం పురపాలక సంఘం ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల రికార్డులను, కంప్యూటరు డేటాను తనిఖీ చేశారు.పదవ తరగతి పూర్తయిన వాళ్ళు అందరూ కాలేజీలో జాయిన్ అయ్యారా, మధ్యలో ఎవరైనా టీసీలు తీసుకుని వెళ్ళినారా అని జిల్లా కలెక్టరు ఆరా తీశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, మద్యలో బడిమానేసిన పిల్లలు, మరల చేర్పించిన పిల్లల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తల్లి దండ్రులు విద్యార్ధులను బడిలో చేర్పించడానికి ఇబ్బందికరంగా వ్యవహరిస్తే ఉపాధ్యాయుల బృందం వెళ్ళి ఆయా తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి భవిష్యత్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆమె సూచించారు. టిసిలు తీసుకుని వెళ్ళే విద్యార్ధులు చిరునామా, మొబైల్ నెంబర్లను, పూర్తి వివరాలు రిజిష్టర్లులో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకట రమణ, జిల్లా పంచాయతీశాఖ అధికారి జివికె.మల్లికార్జునరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.డి.మహేశ్వర రావు, పురపాలక సంఘం కమిషనర్ యం.శ్యామల,వైద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, ఎఎన్ఎంలు, వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img