Friday, May 3, 2024
Friday, May 3, 2024

మహిళలు జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలి….

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి….

విశాలాంధ్ర- భీమవరం: వైయస్ఆర్ సున్నా వడ్డీతో నిరుపేద మహిళలు వ్యాపారాలు మరింత అభివృద్ధి చేసుకుని జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.శుక్రవారం రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ డాక్టరు బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బహిరంగ సభలో వైస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు.
వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ అదే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో నేడు జమ చేసిన ముఖ్య మంత్రి. నేడు అందిస్తున్న రూ.1,353.76 కోట్లతో కలిపి నివైఎస్సార్ సున్నావడ్డీఁ క్రింద ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 4,969.05 కోట్లు.స్థానిక కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హలు నుండి జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, వివిధ శాఖలు అధికారులు, లబ్ధిదారులు హాజరు అయ్యి తిలకించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వైయస్సార్ సున్నా వడ్డీ ద్వారా మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలకు ఆర్థిక పురోగతికి దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన నిరుపేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని, సమాజంలో గౌరవంగా ఆర్దికంగా నిలబడాలని ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టిన జరిగిందన్నారు. ఆచంట నియోజక వర్గానికి 4317 మంది మహిళలకు 6.05 కోట్లు, భీమవరం నియోజకవర్గానికి 4873 మంది మహిళలకు 6.99 కోట్లు, నరసాపురం
నియోజక వర్గానికి 4491 మందికి 6.90 కోట్లు, పాలకొల్లు నియోజక వర్గానికి 5801 మందికి 7.78 కోట్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 4844 మందికి 7.34 కోట్లు, తణుకు నియోజకవర్గానికి 5739 మందికి 8.53 కోట్లు, ఉండి నియోజక వర్గానికి 5881 మందికి 8.36 కోట్లు, ఉంగుటూరు నియోజక వర్గానికి 1241 మందికి 1.76 కోట్లు జిల్లా మొత్తంగా 37,187 మందికి 53.71 కోట్లు జమచేసినట్లు జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఎల్ డి వో కె.సి.హెచ్ అప్పారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టరు ఎమ్ఎస్ఎస్ వేణు గోపాల్, డిపియంలు కె శ్రీనివాస్, డి వెంకటేశ్వర రావు, సియంయం సి హెచ్ నాని బాబు, మహిళా సంఘం ప్రెసిడెంటు పి.అరుణ కుమారి, వైస్ ప్రెసిడెంటు డి. ప్రవీణ, జాయింటు సెక్రటరీ డి.ఆదిలక్ష్మి, మహిళా లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img