Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఏపి ఈ ఆర్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటరమణ, సుబ్రహ్మణ్యం….

విశాలాంధ్ర- ఉండి : ఏపి ఈ ఆర్ యు జిల్లా అధ్యక్షులుగా తాడి వెంకటరమణ, కార్యదర్శిగా కెవిబి సుబ్రమణ్యం ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తూ ఆ నియమక పత్రాన్ని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ నాయుడు చేతుల మీదుగా సోమవారం విజయవాడలో అందించారు. ఈ సందర్భంగా చొప్ప వరపు సాంబశివ నాయుడు మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమస్యలపై , హక్కులపై నిరంతరం పోరాడుతూ అనేక విజయాలను సాధించడంలో ఏపి ఈ ఆర్ యు యూనియన్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ప్రభుత్వం నుండి విలేకరులకు రావలసిన అక్రిడేషన్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్, రైల్వే, బస్సు పాసులు, ఇండ్లస్థలాలు మొదలగు సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎన్నో విజయాలు సాధించడం జరిగిందని తెలిపారు. యూనియన్ లో ఉన్న ప్రతి సభ్యులు సమయస్ఫూర్తితో మెలగాలని అందరినీ కలుపుకుంటూ యూనియన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. యూనియన్ సభ్యుల న్యాయపోరాటం కోసం ఎంతవరకు రావడానికి అయినా నేను సిద్ధమని వారు తెలిపారు. విలేకరుల పట్ల కొంతమంది అధికారులు చూపిస్తున్న తీరు సరైనది కాదని ఆ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామన్నారు. నూతనంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన తాడి వెంకటరమణ కే వి బి సుబ్రహ్మణ్యం భీమవరం జిల్లాలో యూనియన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తాడి వెంకటరమణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా మీద ఉన్న నమ్మకంతో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నిక చేసినందుకు యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మా మీద మీకున్న నమ్మకాన్ని మేము బలపరుస్తూ యూనియన్ అభివృద్ధికి సహకరిస్తామని యూనియన్ ని అభివృద్ధి చేస్తామని వారు హామీ ఇచ్చారు. విలేకరుల సమస్యల పట్ల స్థానికంగా నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్, విజయవాడ యూనియన్ అధ్యక్షులు హుమాయన్ మహమ్మద్, యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, యూనియన్ రాష్ట్ర కోశాధికారి కోటేశ్వరరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ శంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img