Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఢిల్లీ ఐఐఏఇ లో సీటు సాధించిన ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ పూర్వ విద్యార్థి వారధి వినయ్ శ్రీవంశీ…

విశాలాంధ్ర – పాలకొల్లు : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్స్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో ద్వారా ఢిల్లీ కళాశాల లో 4 సం విద్య, శిక్షణలకు ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ పూర్వ విద్యార్థి వంశీ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ లో, వారధి వినయ్ శ్రీ వంశీని అభినందించారు. కోర్సు గూర్చి వివరిస్తూ ఐఐఏఇ ఢిల్లీ లో ప్రతి సం 60 మందిని ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి శిక్షణ తో కూడిన విద్యను అందిస్తారని ఇందుకోసం వేలాది మంది పరీక్షకు హాజరు అవుతారని, అందులో ప్రతిభ తో సీటు సాధించినట్టు తెలిపాడు. స్కూల్ స్థాయి నుండి అందించిన శిక్షణ తనకు ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. స్కూల్ డైరెక్టర్ మద్దాల వాసు మాట్లాడుతూ హైస్కూల్ స్థాయి నుండి పోటీపరిక్షల్లో ఇస్తున్న శిక్షణ వలన అధిక సంఖ్యలో ఉల్లంపర్రు మాంటిస్సోరిస్ విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్నారని అన్నారు. ప్రిన్సిపాల్ వసంత లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి వంశీ క్రమశిక్షణతో చదివి తనలక్షన్ని అందుకున్నాడు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఐ.టి ఫౌండేషన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వేగేశ్న అరుణ, ఉపాధ్యాయులు, విదార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img