Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాష్ట్రంలో అరాచక పాలన

టిడిపి ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి

ఏలూరు:రాష్ర్టంలో వైసిపి ప్రభుత్వ అరాచకాలు మితిమీరిపోతున్నాయని , వాటికి జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏలూరు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి బడేటి చంటి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర ఆదివారం 8వ డివిజన్ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకవైపు టిడిపి చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభిస్తుండడం, మరోవైపు వైసిపి చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను మహిళలు దుమ్మెత్తిపోస్తుండడంతో ఓర్వలేక ముఖ్యమంత్రి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ గుండాలు, రౌడిమూకలు చేస్తున్న అరాచకాలను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ది ఉంటే సంక్షేమ పథకాలతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై వేసిన పన్నుల భారాలు, పెంచిన ఛార్జీల వివరాలను కూడా వివరిస్తూ కరపత్రాలు పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. ఆయా వర్గాలకు టిడిపి ప్రభుత్వం పండుగుల సమయంలో అందజేసిన వివిధ తోఫాలను ఎందుకు ఆపివేసారో ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు తప్ప తమ బతుకులను బాగు చేసేవారు ఎవరూ లేరని ప్రజలు గుర్తించారని సమయం కోసం ఎదురుచూస్తున్నారని, వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని బడేటి చంటి ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్,క్లస్టర్ ఇంఛార్జి మారం అను, పైడేటి రఘు, ఎం.డి సెంషా, దళపతిరాజు శ్రీనివాసరాజు, మద్దుల జనార్ధన్, ఉడా దుర్గా ప్రసాద్, ఎస్.కె కరిముల్లా, రెడ్డి జగదీశ్వరరావు, కాటిసు శ్రీను, రెడ్డి భవాని, వందనాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img