Friday, April 26, 2024
Friday, April 26, 2024

అక్టోబర్ 14న ఏ.ఎస్.ఎన్.ఎం ప్రభుత్వ కళాశాలలో స్వర్ణోత్సవాలు

గజల్ శ్రీనివాస్

పాలకొల్లు: పాలకొల్లు ప్రభుత్వ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 14 న, స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మేడికొండ శ్రీనివాస్ చౌదరి గృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చదువుకున్న ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా 50సంవత్సరాల వేడుక నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 14వ తేదీన ఈకార్యక్రమం గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుని ఉన్నతమైన స్థానాల్లో వున్నారని, తమ కళాశాలకు రుణం తీర్చుకునే సందర్భం వచ్చిందని ఆయన వ్యాఖ్యనించారు. కీర్తిశేషులు ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, మరోదర్శకులు రేలంగి నరసింహారావు, ఇదే కళాశాలలో చదివారని గుర్తు చేసుకున్నారు. పలువురు ప్రముఖులకు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్టు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా 100 పేజీలతో సావనీర్ తీసుకురానున్నట్లు తెలిపారు. గతంలో కళాశాలలో పనిచేసిన అధ్యాపకులను అధ్యాపకేతరులను, పూర్వ విద్యార్థులను సత్కరించనున్నట్లు తెలిపారు. కళాశాలకు గతంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఇచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు ప్రపంచంలో పాలకొల్లుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అక్టోబర్ 14వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కళాకారులతో సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చక్రవధానుల రెడ్డప్ప, దవేజి, అడ్డాల వాసుదేవరావు, న్యాయవాది రావూరి చాచా, అధ్యాపకులు బొక్క రమాకాంత్, రావూరి వెంకట అప్పారావు, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మేడికొండ రాందాస్, వంగా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img