Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నీటి కాలువలను తలపిస్తున్న రహదారులు

చినుకు పడితే చిత్తడే
ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు

చింతలపూడి: చిన్నపాటి వర్షం పడితే చాలు చింతలపూడి పట్టణంలో కొత్తబస్టాండ్ దగ్గర గల రోడ్లయితే ఏకంగా చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. రోడ్లల్లో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.డ్రైనేజి మురికి నీరు కూడా రోడ్డు పైకి రావటంతో ప్రయాణికులకు ఇబ్భందులు పడుతున్నారు.అధికారులు కనీసం రోడ్లవైపు కన్నెత్తి చూడకపోగా చర్యలు శూన్యంమేనని విమర్శిస్తున్నారు.వర్షం పడిదంటే వ్యవశాయశాఖ కార్యాలయం వరకు వరదనీరు రోడ్డుపైనే కుంటలుగా మారిపోతుంది.
పట్టణంలో అధివారం కురిసిన వర్షానికి బస్టాండ్ వద్ద రోడ్లు అన్నీ జలామయం అయినాయి.
వరధ నీరు రోడ్డు పైకి రావటంతో వాహనదారులు ఇబ్భందులు ఎదుర్కోంటున్నారు.గతంలో అనేక స్లారు అధికారులకు స్థానిక ప్రజలు సమస్యను వారి దృష్టికి తిసుకువచ్చినా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.చింతలపూడి బస్టాంఢ్ వద్దకు తెలంగాణాకు ఏలారు,జంగారెడ్డిగుడెం వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది.బస్టాంఢ్ కి నడిచే వెళ్లే ప్రయాణికులకు జలమయం అయిన రోడ్లుమీద నుంచి వెళ్లేలంటే నరకయాతన పడుతున్నారు.రోడ్డుపైకి చెత్త, చేదారాలు చేరి ప్రయాణికులనే కాకుండా,రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు కూడా ఇబ్బందులు కల్గిస్తున్నాయి.
కనీసం సమస్యను తెలుసుకొని పరిష్కరించే విధంగా ఉన్నత అధికారులు చర్యలు తిసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img