Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

వైద్యం రోగుల జీవిత కాలాన్ని పెంచే విధంగా ఉండాలి

ఏలూరు: వైద్యం రోగుల జీవిత కాలాన్ని పెంపొందించే విధంగా ఉండాలని రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. పోతినేని రమేష్ బాబు అన్నారు. ఆదివారం రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఏలూరులో వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. రవి,గౌరవ అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. సి.శ్రీనివాస రాజు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్. పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ
గుండె జబ్బులలో వ్యాధి నిర్ధారణ చాలా ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.తదుపరి చికిత్సలో తీసుకొనే ఖచ్చితమైన,సరైన నిర్ణయాలు రోగుల జీవిత కాలాన్ని పెంపొందించే విధంగా ఉండాలన్నారు. శాస్త్రీయ పరంగా,సాంకేతిక పరంగా ఇటీవలి కాలంలో గుండె జబ్బుల వ్యాధి నిర్ధారణలో ఎన్నో అధునాతమైన వైద్య పరికరాలు,చికిత్సా విధానాలు అందుబాటులోనికి వచ్చాయన్నారు.గుండె వ్యాధిని 15 సంవత్సరాల ముందుగానే గుర్తించే సిటి యాంజీయో గ్రామ్ నిర్వహించే వైద్య పరికరాలు అందుబాటులోనికి రావడం శుభపరిణామమన్నారు. ఆకస్మికంగా వచ్చే గుండెపోటు తద్వారా సంభవించే మరణాలను నివారించవచ్చని తెలియచేసారు.నిపుణులైన,అనుభవజ్ఞులైన డాక్టర్ల వైద్య బృందంతో టెలి మెడిసిన్, టెలి యమర్జన్సీరూమ్ వంటి
సాంకేతికంగా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో అనవసరంగా జరిగే 50 శాతం అడ్మిషన్లను,వైద్య పరీక్షలను, తీసుకొనే మందులను నివారించవచ్చని తెలియచేశారు.
గుండె వైద్య చికిత్సలో వస్తున్న ఆధునాతన వైద్యవిధానాలను కార్డియాలజిస్టులు డాక్టర్. కృష్ణ మోహన్,డాక్టర్.వెలగా అనూప్,చిన్న పిల్లల గుండె వైద్య చికిత్సలో వస్తున్న ఆధునాతన వైద్య విధానాలను డాక్టర్. వాసుదేవ్,డాక్టర్.ముర్తజ కమాల్, మెదడు,నరముల వైద్య విభాగంలో రిటైర్డ్ మేజర్ జనరల్ డాక్టర్.కుమారవేలు,డాక్టర్.బాలకృష్ణ,న్యూరో సర్జన్ డాక్టర్.అమీన్,ప్రముఖ జీర్ణకోశ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్.బత్తిని రాజేష్, మూత్రపిండాల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్.వై.రమేష్, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్.ధరణింద్ర, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్.బాలకృష్ణ, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్.పూర్ణచంద్రరావు, సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్.రామ సుబ్రహ్మణ్యం ఈ సమావేశంలో పాల్గొన్న 180 మంది వైద్యులకు తెలియచేశారు.

జిల్లాలో గత 50 సంవత్సరములుగా అత్యుత్తమంగా వైద్య చికిత్సలు అందించిన సీనియర్ వైద్య నిపుణులైన డాక్టర్. ఆర్.గోపాలకృష్ణయ్య, డాక్టర్.యార్లగడ్డ జగన్మోహన్ రావు,డాక్టర్.ఎం.సంజీవరావు గార్లకు సన్మానం చేశారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్.విజయ భాస్కరరెడ్డి,సెక్రటరీ డాక్టర్. సత్యనారయణ, రమేష్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్.సోమనాథ్, యూనిట్ హెడ్ డాక్టర్.సుదర్శన్, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ డాక్టర్.కార్తీక్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img