Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గిరిజనుల ఓట్ల కోసం బిజెపి రాజకీయం

సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్

చింతలపూడి:గిరిజనుల ఓట్లను కొల్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. చింతలపూడి లోని స్థానిక సిపిఐ కార్యాలయంలో చింతలపూడి మండలం నరసాపురం మండలం సమితి సంయుక్త సమావేశం జంగా రామచంద్ర రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రత్యేక రాజకీయ కారణాలతోనే భారతదేశంలో గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. గిరిజనుల ఓట్లు 7 , 8 శాతం ఉన్నాయని ద్రౌపది ముర్ము గవర్నర్ గా ఉన్నప్పుడు తమ సొంత గ్రామానికి కరెంట్ లేదని ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే హడావుడిగా గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారన్నారు. గిరిజనులకు సంబంధించిన చట్టాలను ఎత్తివేసి అడవి భూములను కార్పొరేట్ సంస్థలకు 40 రోజుల్లో అప్పజెప్పాలనే విధానాన్ని సిపిఐ వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఎన్నికకు సిపిఐ వ్యతిరేకం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో విఫలం అయిందన్నారు. ప్రభుత్వం వరద బాధితులను కాపాడేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పత్రికల్లో చెప్పుకోవడమే కానీ చేతల్లో లేదన్నారు. అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని పత్రికల ద్వారా ప్రజలను మోసం చేస్తోందని, సిపిఐ రాష్ట్ర బృందం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిందని మద్దిగట్ల గ్రామంలో 8 రోజులుగా వరద బాధితులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్రప్రభుత్వం రెండు మంచినీళ్లు ప్యాకెట్లు, అరకేజీ చొప్పున కూరగాయలను అందించారని బాధితులు తెలిపారన్నారు. ప్రభుత్వం వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రతి కుటుంబానికి రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, టీ నర్సాపురం మండల కార్యదర్శి సాకా గంగరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు బి ఎన్ సాగర్, బోడ వజ్రం, పుల్లూరు సోమశేఖర్, టి బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img