Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏలూరు అగ్నిగుండం…

పెరుగుతున్న పగటిఉష్ణోగ్రతలు
అల్లాడుతున్న జనం

విశాలాంధ్ర ఏలూరు: ఏలూరులో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం గం.6 నుంచి సాయంత్రం గం.6 వరకు సూర్యుడు నిప్పులు చె రుగుతూ ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు . గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఎండ తీవ్రతకు రోహిణి కార్తె తోడవడంతో సూర్యప్రతాపం మరింత ఎక్కువగా ఉంది.
ఎండ వేడిమి భరించలేక ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితమై పోతున్నారు.
ఉదయం 11 గంటలకే ఏలూరులోని రోడ్లన్నీ జనసంచారం లేక ఖాళీగా కనిపిస్తూ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
మధ్య ,ఎగువ తరగతి ప్రజలు రాత్రి పగలు తేడా లేకుండా ఏసీ గదులకే పరిమితమై పోతున్నారు.
ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇళ్లలో ఏ వస్తువును ముట్టుకున్న కాలిపోతున్నాయి. పాత్రలలో నీళ్లు మరిగిపోతున్నాయి. ఫ్యాను గాలి కూడా వేడిగా వస్తుండటంతో వృద్ధులు ,చిన్నపిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు.
భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్ షాపులు, కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు.
వీటికి డిమాండ్ పెరగడంతో ధరలు చుక్కలను అంటుతున్నాయి.మరో వారం పది రోజులపాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img