Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

మండల మహిళా సమాఖ్య ఆధ్యక్షురాలిగా కృపామణి….

విశాలాంధ్ర- కొయ్యలగూడెం: మహిళా స్వయం సహాయక సంఘాల సమాఖ్య మండల అధ్యక్షురాలిగా తోట కృపామణి ఎంపికయ్యారు. మండల సమాఖ్య ఎన్నికలు మండల సమాఖ్య భవనంలో జరిగాయి. పూర్వపు అధ్యక్షురాలు అంగిన చిన్నయమ్మ ఆధ్వర్యంలో గ్రామ సంఘాల అధ్యక్షులు ఓటింగ్ లో పాల్గొని కనకాద్రిపురం గ్రామ సంఘం అధ్యక్షురాలైన కృపామణిని మెజారిటీ సభ్యులు మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. మండల సమాఖ్య కార్యదర్శిగా కిచ్చప్పగూడెంకు చెందిన సున్నం గంగాదేవిని ఎన్నుకున్నారు.కోశాధికారిగా పొంగుటూరుకు చెందిన సిర్రా కనకరత్నంను ఎన్నుకున్నారు.మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ,మహిళల ఆర్థిక బలోపేతానికి కమిటి కృషి చేస్తామని గౌరవ అధ్యక్షురాలు చిన్నాయమ్మ నూతన కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా పూర్వపు అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించారు.నూతనంగా ఎన్నికైన కృపామణి మాట్లాడుతూ మహిళల ఆర్థిక బలోపేతానికి నాయకులు, అధికారుల సహకారంతో తమ కమిటీ పని చేస్తాదని ఆమె పేర్కొన్నారు . మహిళలు తమ కాళ్ళపై తాము నిలబటానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న విధానాలు,పధకాలు మహిళలందరకి అవగాహన కల్పిస్తామన్నారు. మహిళలు పొదుపు చేసుకోవటం ఎంత ముఖ్యమో ఆర్ధికంగా స్థిరపడటం అంతే ముఖ్యమని అభిప్రాయ పడ్డారు.ప్ర ధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పధకం ద్వారా మహిళల ఆర్ధిక పరిపుష్టికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. నాబార్డు ద్వారా శిక్షణ పొంది ఇప్పటికే అవార్డు పొందిన అనుభవం ఉన్న దృష్ట్యా మహిళలకు సాంకేతిక శిక్షణ ఇప్పించటానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు.జగన్న బడుగు వికాసం పధకం ద్వారా ఎస్. సి, ఎస్. టి మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
పిఏంఈజిపి పధకం మహిళలు ఉపయోగించుకోవచ్చన్నారు. అందుకోసం బ్యాంకులు సహకారం అవసరమన్నారు . మహిళల సివిల్ స్కోర్ 700 దాటి ఉంటేనే బ్యాంక్ అధికారులు రుణం ఇవ్వటానికి ముందుకు వస్తారన్నారు. యూనిట్ స్థాపించి మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం ప్రభుత్వం కల్పించటానకి ముదుకు వస్తుందన్నారు. ఇవన్నీ స్థానిక శాసన సభ్యులు తెల్లం బాలరాజు , జిల్లా కెలక్టర్ ప్రసన్న వెంకటేష్ , డి. ఆర్. డి. ఏ ప్రొజెక్టు డైరెక్టర్ విజయ రాజు , ఇతర నాయకులు , అధికారుల సహకారంతో మండలంలో ఉన్న మహిళలకు ఉపయోగ పడేలా పని చేస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img