విశాలాంధ్ర – కొయ్యలగూడెం: వైయస్సార్ ఆసరా పథకం లో భాగంగా మూడో విడత నిధులు మంజూరు చేయటానికి శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ ని పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్ గంజిమల దేవి , ఎంపీపీ గంజిమల రామారావు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి అక్క చెల్లెమ్మలు రాష్ట్రం లో ఎంతో సంతోషంగా , జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల తో సుభిక్షంగా ఉన్నారని కొనియాడారు. దేవుని ఆశీర్వాదంతో రాష్ట్రం లో ఉన్న అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదంతో తిరిగి జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రతీ మహిళ కోరుకుంటున్నట్లు జగన్ కి తెలిపారు.