Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

సంక్షేమం ముసుగులో ఆర్భాటం

బడేటి చంటి

ఏలూరు : సంక్షేమం ముసుగులో వైసిపి ప్రభుత్వం ఆర్భాటం చేయడం తప్ప అభివృద్ధి లేదని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి బడేటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర మంగళవారం స్థానిక 41 డివిజన్ తంగేళ్లమూడి వంతెన వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కడం, ఫోటో దిగడం, టిడిపిని ఆడిపోసుకోవటం తప్ప ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతకాదని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తే సి.ఎం జగన్ మొండివైఖరితో దాన్ని నాశనం చేశారని బడేటి చంటి ఆరోపించారు. రాష్ట్ర రైతాంగం భవిష్యత్ తో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తూ నిర్మాణాన్ని పట్టించుకోవడం మానివేసిందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆశయం జగన్ కు లేదని తేటతెల్లం అవుతోందన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అన్న ఆలోచన ప్రజలు చేయాలని ఆయన కోరారు. వైసిపి ప్రభుత్వం పథకాల పేరిట ఒక చేత్తో డబ్బులు ఇస్తూ మరో చేత్తో లాగేస్తోందని విమర్శించారు. అనుభవం లేని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని అన్నిచోట్ల పరువు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ పాలనపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయిందని , బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బౌరోతు బాలాజీ, డివిజన్ ఇంచార్జ్
జాగని సంతోషి మాత (ప్రసాద్), మాజీ కార్పొరేటర్ ఈదుపల్లి రామ్-లక్ష్మణ్,అల్లం ఉమా,దత్తిరాము,మచ్చ శంకర్,వేగిరెడ్డి శివశంకర్,కుమార్,సాయి, సంపంగి మాధవ్,ముప్పిడి కృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img