Monday, October 3, 2022
Monday, October 3, 2022

పి జి మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

ఏలూరు: సర్ సి ఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో జూలైలో జరిగిన పి జి మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు కళాశాల పిజి కోర్సుల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను కళాశాల వెబ్ సైట్ నుండి తెలుసుకొనగలరని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. ఎ. రామరాజు తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి జి కోర్సుల వైస్ ప్రిన్సిపాల్ ఎ. విజయకుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె. విశ్వేశ్వర రావు, అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. వైవి ఆర్ ఎస్ బాబు, కె. ఆనందరావు, జి ఎం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img