Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రస్థాయి పురుషుల – మహిళల టెన్నిస్, క్రికెట్ పోటీలు

ఏలూరు: నేటి నుండి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి ఏడవ సీనియర్ పురుషుల, మహిళల టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలు స్టార్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్లడ్ జరుగుతాయని ఏపిటెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ డి ప్రసాద్ తెలిపారు. స్థానిక ఆంతోని నగరంలో ఆంతోని భవనంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులు నైపుణ్యత సాధిస్తారన్నారు. పోటీల్లో 13 జిల్లాల నుండి ద 400 మంది పోటీదారులు పాల్గొంటారని తెలిపారు. ఆటలు ఆడడానికి వచ్చినవారికి వసతి, భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. మొత్తం 56 మ్యాచ్ ఉంటాయని పగలు రాత్రి ఫ్లడ్ లైట్ క్రాంతి లో జరుగుతాయన్నారు. పురుషుల విభాగంలో మొదటి బహుమతి రూ.30 వేలు రెండో బహుమతి రూ.20 వేలు మహిళా విభాగంలో మొదటి బహుమతి రూ. 10వేలు రెండో బహుమతి రూ.5వేలు అందించడం జరుగుతుందన్నారు. మొత్తం రూ.70 వేలు క్రీడాకారులకు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ పోటీలలో సెలెక్ట్ అయిన వారిని వచ్చేనెల హరిద్వార్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. క్రికెట్ కు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించిన క్రీడ టెన్నిస్ బాల్ క్రికెట్ అన్నారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ను పోస్టల్ శాఖలో ,ఎల్ఐసి శాఖలో, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో కలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ కోఆర్డినేటర్ జోసెఫ్, ఏలూరు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిషోర్, సీనియర్ కోచ్ కృష్ణారావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img