Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బోడపాడు విద్యార్థులకు రోడ్డు సౌకర్యం మెరుగుపరచాలి

పెంటపాడు:బోడపాడు గ్రామానికి చెందిన విద్యార్థులుకు రావిపాడు హై స్కూల్ వెళ్లడానికి సౌకర్యం కల్పించాలని సిపిఐ మండల సమితి డిమాండ్ చేసింది. శనివారం బోడపాడు గ్రామంలో విద్యార్థులు రావిపాడు వెళుతున్న మట్టి రోడ్డును సిపిఐ మండల కార్యదర్శి కలింగ లక్ష్మణరావు, మండల సమితి నాయకులు బోడబల్ల లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఆ మార్గంలో వెళుతున్న విద్యార్థులను వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుంత రోడ్డు గుండా మార్గం మట్టి గ్రావెల్ కలిసి ఉండటం వల్ల సైకిల్ మీద 4 కిలోమీటర్లు ప్రయాణం కష్టంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. వర్షాకాలంలో సైకిల్ పై వెళ్లడానికి ప్రయత్నం చేసిన కొంత దూరం వెళ్లిన తర్వాత రిపేరు రావడం మార్గమధ్యంలో స్కూలుకు వెళ్లలేక తిరిగి వచ్చేస్తున్నారన్నారు. వెళ్లడానికి ప్రయత్నం చేసినా రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ రోజులు విద్యార్థులు స్కూలుకి వెళ్లలేకపోతున్నామన్నారు. బోడపాడు నుండి రావిపాడు హైస్కూల్ కు దూరం 4 కిలోమీటర్లు 9వ తరగతి పదో తరగతి విద్యార్థులు 27 మంది వెళ్లు చున్నారు. సరైన మార్గం లేక కొంతమంది తల్లిదండ్రులు వేరే గ్రామాల్లో చదివించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రధానమైన సమస్య స్కూల్ కి వెళ్లడానికి బోడపాడు వెంకయ్య కెనాల్ కు రావిపాడు బల్ల కట్టు ఏర్పాటు చేయాలి లేదా పుంత రోడ్డు మీదిగా వెళ్లడానికి అనువుగా గ్రావెల్ వేసి విద్యార్థులు చదువుకు ఆటంకం కాకుండా ప్రత్యమ్నయం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. విద్యార్థులు సరైన మార్గం లేక రోజు రోజుకు బోడపాడు విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల ఖర్చు చేసి ప్రచారం చేస్తుంది కాని, బోడపాడు విద్యార్థులు సమస్య మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులకు సరైన రోడ్డు మార్గం, లేదా బల్లకట్టు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తో ఆందోళన, పోరాటాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img