Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

డిసెంబర్ నాటికి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి

భీమవరం టౌన్: ఈ ఏడాది డిసెంబర్ నాటికి పట్నంలో అమృత్ పథకంలో నిర్మిస్తున్నా రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయి ప్రజా వినియోగానికి వస్తాయని ఎంఎల్ఏ గ్రంథి శ్రీనివాసరావు అన్నారు .ఈ మేరకు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ డీ ఈ విజయ్ ,కాంట్రాక్ట రు వర్మ తో మాట్లాడారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గాపురంలో రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిందని పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండో పట్నం బీసీ కాలనీలో మూడవ పట్టణంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.ఈ రిజర్వాయర్లకు పైప్ లైన్ నిర్మాణం కొద్దీ ఆలస్యం పడుతుందని , పట్టణంలోను నీటి సమస్య కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img