Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత కు చిరు సత్కారం

పెనుమంట్ర:మార్టేరు శ్రీకంచి కామాక్షి దేవి ఆలయంలో పంచ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చదువుల వెంకట నరేంద్రను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు విద్యారంగానికి నరేంద్ర చేస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సన్మాన గ్రహీత నరేంద్ర మాట్లాడుతూ నేటి యువత విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. సంఘ సభ్యులు చేసిన సత్కారం మరువలేనిదని ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img