వైరల్గా మారిన పెళ్లి కార్డు
అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగనుంది. హీరో సుమంత్ అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడని, పవిత్ర అనే ఓ వ్యాపారి కూతురిని పెళ్లాడబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి పనులను కూడా మొదలుపెట్టేశారన్న చర్చ నడుస్తోంది. పెళ్లి కార్డులనూ పంచారని సమాచారం.ఆ పెళ్లికార్డే ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది సమక్షంలోనే పెళ్లి తంతు జరిపించేస్తున్నారని తెలుస్తోంది. 2004లో కీర్తిరెడ్డిని సుమంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, మనస్ఫర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ సినిమా చేశాడు. మేలో షూటింగ్ నూ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా సాగుతున్నాయి.