Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైద్య నిపుణులకు కర్ణాటక ప్రభుత్వం హెచ్చరిక

బెంగళూరు: కోవిడ్‌-19కి సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు కొంతమంది వైద్య నిపుణులను కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. కొంతమంది వైద్య నిపుణులు కోవిడ్‌-19 గురించి అసంపూర్ణ, సరికాని, నిరాధార సూచనలు ఇస్తున్నారని ఆరోగ్య ,కుటుంబ సేవల కమిషనరేట్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ’ఇటువంటి తప్పుడు సమాచారం వల్ల రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న కోవిడ్‌ వ్యాప్తిపై ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తుంది…ఆరోగ్య అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పట్టించుకోని విధంగా వారిని ప్రోత్సహిస్తుంది’ ప్రకటన పేర్కొంది. కోవిడ్‌`19పై ప్రజలకు అవగాహ కల్పించేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులను కోరుతూ, ఏదైనా మీడియా లేదా సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లో కనిపించే ముందు ప్రభుత్వ మార్గదర్శకాలు, సర్క్యులర్‌పై వివరించాలని కమిషనరేట్‌ వారిని కోరింది. కర్ణాటకలో ఆదివారం 34,047 కరోనా కొత్త కేసులు,13 మరణాలు, సోమవారం 27,156 కొత్త కేసులు, 14 మరణాలు నమోదైన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img