Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

చట్టసభలు చట్టాలను పున: పరిశీలించాలి

ప్రజల అవసరాలకు తగినట్లుగా సంస్కరించాలి : సీజేఐ ఎన్‌.వి.రమణ

కటక్‌ : చట్టసభలు చట్టాలను పున: పరిశీ లించాల్సిన అవసరం ఉందని, సమయం, ప్రజల అవసరాలకు తగిన విధంగా వాటిని సంస్కరించ డం ద్వారా ‘వాస్తవిక ఆచరణాత్మకత’కు అవి సరిపోతాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శనివారం అన్నారు. ఇక్కడ ఒడిశా రాష్ట్ర న్యాయ సేవ మండలి నూతన భవనాన్ని సీజేఐ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చడం’లో కార్యనిర్వాహక, చట్టసభలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘మన చట్టాలు మన ఆచరణాత్మక వాస్తవాలతో సరిపోల్చాలని నొక్కి చెబుతున్నాను. కార్యనిర్వా హకుడు సంబంధిత నియమాలను సరళీకృతం చేయడం ద్వారా ఈ ప్రయత్నాలను సరిపోల్చాలి’ అని తెలిపారు. ‘రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చడం’లో కార్యనిర్వాహక, చట్టసభలు కలిసి పని చేయడం చాలా ముఖ్యమని నొక్కి చెబుతూ, అప్పుడు మాత్రమే, న్యాయవ్యవస్థ చట్టాలను రూపొందించేదిగా ఉండదని, చట్టాలను వర్తింపజేయడం, వివరించడమే విధిగా ఉంటుం దని సీజేఐ గుర్తు చేశారు. దేశంలో మూడు అంగాలు సామరస్యపూర్వకంగా పని చేసిన రోజునే న్యాయానికి సంబంధించిన విధానప రమైన అడ్డంకులు తొలగిపోతాయని స్పష్టం చేశారు. భారత న్యాయవ్యవస్థ జంట సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అందులో మొదటిది, న్యాయ పంపిణీ వ్యవస్థ భారతీయీ కరణ’ అని సీజేఐ ఎత్తి చూపారు. స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినప్పటికీ, సాధారణ మార్గాలను అనుసరిస్తున్న సంప్రదాయ, వ్యవసా య సమాజాలు కోర్టులను ఆశ్రయించేందుకు సంకోచిస్తున్నాయని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తు చేశారు. ‘మన న్యాయస్థానాల విధానాలు, భాష, పద్ధతులు వారికి పరాయివిగా అనిపిస్తు న్నాయి’ అని అన్నారు. చట్టాల సంక్లిష్ట భాష, న్యాయ పంపిణీ ప్రక్రియ మధ్య సామాన్యుడు తన సమస్యపై అదుపు కోల్పోతున్నట్లు కనిపిస్తాడని, ఈ క్రమంలో న్యాయం కోరుకునే వారు వ్యవస్థకు వెలుపలి వ్యక్తిగా భావిస్తారని తెలిపారు. అయితే ఇది కఠినమైన వాస్తవం అయినప్పటికీ, తరచుగా భారత న్యాయవ్యవస్థ సామాజిక వాస్తవాలు, చిక్కులను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతోందని అన్నారు. దురదృష్టవశాత్తూ, న్యాయస్థానంలో చట్టాలు, అన్ని వాస్తవాలను చేర్చే సమయానికి చాలా నష్టపోయేలా మన వ్యవస్థ రూపొందించబడిరది’ అని సీజేఐ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img