Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఉగ్రవాద ప్రభావాన్ని ప్రపంచం చూస్తోంది..

దేశ నిర్మాణం, ప్రవర్తనలో మార్పునకు సాధనంగా ఉగ్రవాదం
దీనిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూదిల్లీ : అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలు అధికార రాజకీయాల పాత్ర, దేశ నిర్మాణాలు, ప్రవర్తనను మార్చేందుకు ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగించడం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం తెలిపారు. తాలిబన్ల పేరు ప్రస్తావించకుండా సింగ్‌ మాట్లాడుతూ ‘కొత్త సాధారణత’ను సృష్టించడం ద్వారా చట్టబద్ధతను పొందేందుకు ఉగ్రవాద అస్థిరపరిచే ప్రభావాలను, ప్రత్యేకించి హింసాత్మక రాడికల్‌ శక్తుల ప్రమాదకరమైన ప్రాధాన్యతను ప్రపంచం చూస్తోందని అన్నారు. జాతీయ రక్షణ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, బాలాకోట్‌, గాల్వన్‌లలో భారత్‌ తీసుకున్న చర్యలు ‘దురాక్రమణదారులు’కు స్పష్టమైన సంకేతాలు పంపాయని, తమ సార్వభౌమత్వానికి ముప్పు తెచ్చే ఏ ప్రయత్నానికైనా ‘వేగవంతంగా, తగినవిధంగా’ స్పందించి బుద్ధి చెబుతామని తెలియజెప్పిందని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే దేశాల ద్వారా అటువంటి శక్తులకు మద్దతు ఇవ్వడం, ‘దురాక్రమణ పద్ధతులు’ను తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతంలో గందరగోళం ఏర్పడిరదని పాకిస్తాన్‌ను ఉద్దేశించి స్పష్టంగా సూచించారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్‌ మద్దతు ఇవ్వడంపై భారతదేశ ఆందోళనలు ఇప్పుడు పెరుగుతున్నాయని అన్నారు. ‘ఈరోజు, బాధ్యత కలిగిన అన్ని దేశాలలో దీనిపై విస్తృత అవగాహన ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం కలిసికట్టుగా ఒక ఉమ్మడి అవగాహనకు రావాల్సి ఉంది’ అని తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ ప్రాంతంలోను, వెలుపల ప్రతిధ్వనిస్తున్నాయని రక్షణ మంత్రి అన్నారు. అఫ్గానిస్తాన్‌లో ఏమి జరిగినా దాని నుంచి పాఠం నేర్చుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img