Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాష్ట్రాల హక్కుల హరణకు ప్రతిఘటన

డా. జ్ఞాన పాఠక్‌

రాష్ట్రాల హక్కులను మోదీ ప్రభుత్వం హరించి వేస్తోంది. ఇప్పటికే అనేక హక్కులను కేంద్రం కొత్త చట్టాలు తెచ్చి హరించింది. ఉమ్మడి జాబితాలో ఉన్న వాటినే కాదు, రాష్ట్ర జాబితాలోని వాటిని కూడా కేంద్రం బలవంతంగా లాగేసుకొంటోంది. ఈ విధానాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తు న్నాయి. నీట్‌ పరీక్ష నిర్వహణను కూడా మోదీ ప్రభుత్వ హక్కు భుక్తం చేసుకున్నది. నీట్‌ పరీక్షలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వగా, చివరి నిమిషం ఇదేమి టని కోర్టు ఆగ్రహం ప్రకటించింది. లోపాలను సరి చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. చివరికి గ్రామ పంచా యతీ స్థాయిలోనూ మోదీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. రాజ్యాంగం ఆధారంగా ఏర్పడిన సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మౌలిక స్వరూపాన్ని పథకాల ద్వారా దిగజార్చేందుకు పూనుకున్నారు. జాతీయ అర్హతప్రవేశ పరీక్ష (నీట్‌) నిర్వహణ రాష్ట్రాల రాజ్యాంగ హక్కు. ఈ హక్కును కాపాడుకుందామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఇటీవల 12 రాష్ట్రాల ప్రతిపక్షాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల పద్ధతిని నిర్ణయించవలసింది రాష్ట్రాలే. జాతీయ విద్యా విధానంతో సహా యూజీసీ ఇతర విద్యాసంస్థల ద్వారా కేంద్రం విద్యకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుం టోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యతను విస్తరించాలనే ధ్యేయంతో స్టాలిన్‌ లేఖ రాశారు. విద్యా రంగానికి సంబంధించిన విషయాల్లో రాజ్యాంగం రాష్ట్రాలకు హక్కు కల్పించింది. ఈ హక్కును కాపాడుకునేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి కృషి చేయవలసిన తరుణమిది. పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, మహరాష్ట్ర, జార్ఖండ్‌, చత్తీస్‌ఘర్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, తెలంగాణ, దిల్లీ, కేరళ, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కేంద్రం విధానాలను, చట్టాలను అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యా వేత్తలు వ్యతిరేకిస్తున్నారు. నీట్‌ విద్యారంగ ప్రగతికి అడ్డంకిగా నిలుస్తుం దని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రీయ దృక్పథాన్ని నిర్మూలించి విద్యను కాషాయీకరణ చేసేందుకే కేంద్రం పూనుకొన్నదని, ఇది తిరోగామి విధానమని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా పేద వర్గాలకు ఉన్నత విద్య అందకుండా నీట్‌ చేస్తుంది. ప్రజలలో ప్రజాస్వామ్య భావన లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే తగినంత మంది డాక్టర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీట్‌ అమలయితే మరింత దారుణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశ చట్టం 2021 ని ఆమోదించింది. నీట్‌ ద్వారా జరిగే నష్టాన్ని ఈ విధంగా పూడ్చుకొనేందుకు తమిళనాడు ఈ చట్టం చేసింది. అయితే ఈ చట్టానికి ఇంకా రాష్ట్రపతి ఆమోదం లభించ లేదు. సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల పైన నీట్‌ పరీక్ష దుష్ప్రభావాన్ని మాజీ జడ్జి ఎ.కె.రాజన్‌ కమిటీ తన నివేదికలో వివరించింది. పేదల, వెనుకబడిన తరగతుల విద్యార్థుల ప్రయోజనాలను నీట్‌ కాపాడలేదని నివే దిక పేర్కొన్నది. మద్రాసు హైకోర్టు మాజీ జడ్జి అధ్వర్యంలోని కమిటీ అధ్య యనం చేసి నివేదికను రూపొందించింది. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు డాక్టర్లు లభించే అవకాశం నీట్‌ ద్వారా ఉండదని, సంపన్న ధనిక వర్గాల విద్యార్థులకు మాత్రమే డాక్టరు కోర్సులో ప్రవేశాలు లభిస్తాయని కమిటీ పేర్కొన్నది. నీట్‌ తప్పనిసరి చేయక ముందు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన అత్యధిక విద్యార్థులు డాక్టరు కోర్సులో ప్రవేశాలు పొందారు. సీబీఎస్‌ఈ ఇతర పాఠ్యాంశాల ఆధారంగా ఉండే ఈ కోర్సు చదవడం సాధ్యం కాదని అనేక రాష్ట్రాలలో విద్యార్థులు నీట్‌ పరీక్షకు దరఖాస్తులు కూడా చేయలేదని రాజన్‌ కమిటీ పేర్కిన్నది. బహు భాషలతో భారతదేశం అలరారుతున్నది. బహుళ సంస్కృతులు, భాషలతో సమాజం కొనసాగుతున్నది. ఆయా ప్రాంతీయ భాషలలోనే బోధిస్తే విద్యార్థులు తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతర కఠినమైన భాషలను నేర్చుకోవడానికి విద్యార్థు లందరి స్థాయి ఒకే విధంగా ఉండదు. స్థానిక భాషలు తెలిసిన డాక్టర్లు వ్యాధిగ్రస్థులతో తేలికగా మాట్లాడి వారి రుగ్మతలను తెలుసు కోగలుగుతారు. అలా కానప్పుడు డాక్టర్లకు రోగులు చెప్పే అంశాలు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అంతిమంగా ప్రజలకు నష్టం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీట్‌ సమాఖ్య భావనకు విరుద్ధమైంది, రాజ్యాంగ, అధికార సమతుల్యతను దెబ్బతీసినట్లు అవుతుంది. వైద్యరంగ సంస్థలలో ప్రవేశ పద్ధతిని నిర్ణయించటం సంస్థల ఏర్పాటు, వాటి నిర్వహణ హక్కు రాష్ట్రాలదే. ఆయా రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు వైద్య విద్య అందించడమనేది కీలకమైన అంశం. నీట్‌ 201718 లో ప్రవేశపెట్టారు. నీట్‌తో తమకు సంబంధం ఉండబోదని 2021 సెప్టెంబరు 13 వ తేదీన తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం రానందున కేంద్రం ప్రవేశపెట్టిన నీట్‌ను ప్రతిఘటించాలని స్టాలిన్‌ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img