Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఈసారి పత్తి సేకరణ లక్ష్యం 33.20 లక్షల మెట్రిక్‌ టన్నులు

: మంత్రి నిరంజన్‌ రెడ్డి
తెలంగాణ శాసనసభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పత్తిలో తేమ శాతం, వర్షాలతో పంటనష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌ రెడ్డి సమాధానమిచ్చారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో పత్తి సేకరణ లక్ష్యం ఈసారి 33.20 లక్షల మెట్రిక్‌ టన్నులని తెలిపారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టింపు పత్తి ఉత్పత్తి అవుతుందని చెప్పారు. పత్తి కొనుగోలుకు జిన్నింగ్‌ విల్లులనే నోటిఫైడ్‌ ఏజెన్సీలుగా గుర్తింపునిచ్చామని తెలిపారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటేనే సీసీఐ కొంటుందన్నారు. రైతులకు సబ్సిడీ మీద టార్ఫాలిన్స్‌ ఇచ్చామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img