Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అఫ్గాన్‌కు భారత్‌ ఆర్థిక సాయం

కాబూల్‌ : అఫ్గాన్‌లో అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో చర్చలు జరుపుతున్న భారత్‌..తాజాగా ఓ అంగీకారానికి వచ్చింది. ఆఫ్గాన్‌ పౌరుల భవిష్యత్తు దృష్ట్యా భారీ మానవతాదృక్పధంతో ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తాలిబన్లు నిర్థారించారు. తాలిబన్లతో జరిగిన చర్చల్లో భారత్‌ తరఫున విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి జేపీ సింగ్‌ పాల్గొన్నారు. తాలిబన్ల తరఫున డిప్యూటీ ప్రధాని అబ్దుల్‌ సలాప్‌ా హసాఫీ హాజరయ్యారు. రెండు దేశాలు పరస్పరం ఆర్థిక, దౌత్య సంబంధాలు విస్త్రతం చేసుకోవాలని నిర్ణయించాయి. రెండు దేశాల సమస్యలపై సంయుక్తంగా దృష్టి సారించాలని నిర్థారించారు. ఆఫ్గాన్‌కు భారీ ఆర్థిక సహాయం చేసేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఆఫ్గాన్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి ఇబ్బందుల దృష్ట్యా 50 వేల మెట్రిక్‌ టన్నులు గోధుమల్ని వెంటనే పంపాలని నిర్ణయించింది. ఈ సాయాన్ని ఐక్యరాజ్యసమితి ద్వారా చేయించాలని నిర్ణయించింది. మాస్కో ఫార్మాట్‌లో చర్చల్ని కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. భవిష్యత్తులో అఫ్గాన ్‌ భూభాగం రక్షణపరంగా భారత్‌కు కీలకంగా మారనుంది. భారీ ఎత్తున ఆర్థికసాయం ప్రకటించడం ద్వారా అఫ్గాన్‌ నుంచి సమస్యలు ఎదురుకాకుండా భారత్‌ ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img